ప్రభాస్ అభిమానులకు అక్టోబర్ 23న పండగే

0

బాహుబలి సినిమాల హిట్స్ తర్వాత ఇండియాలో ప్రభాస్ పేరు మారుమోగిపోయింది. అన్ని భాషల ప్రేక్షకులు ప్రభాస్ కి అభిమానులుగా మారిపోయారు. దాంతో బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన ‘సాహో’ అంతకంటే పెద్ద హిట్ అవ్వాలని ప్రభాస్ చాలా కష్టపడ్డాడు. కానీ ఈ సినిమా తెలుగులో అనుకున్నంత సక్సెస్ కాలేదు. హిందీలో మాత్రం సినిమా సూపర్ హిట్ అయ్యింది. మిగిలిన భాషల్లో ‘సాహో’ పెద్దగా ప్రభావం చూపించలేదు. ‘సాహో’ విడుదల తర్వాత ప్రభాస్ విదేశాలకు వెళ్లి రెస్ట్ తీసుకుంటున్నాడు. అక్కడి నుండి వచ్చాక తన తర్వాత సినిమా షూటింగ్ మొదలుపెడతాడు.

‘సాహో’ సినిమా తర్వాత ప్రభాస్ ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ డైరెక్షన్ లో ఒక లవ్ స్టోరీలో నటిస్తున్నాడు. ఇప్పటివరకూ ఈ సినిమాకు ‘జాన్’ అనే పేరు ప్రచారంలో ఉంది. కానీ ఇది టైటిల్ కాదని ఈ సినిమా టైటిల్ ప్రభాస్ పుట్టినరోజు అక్టోబర్ 23న ప్రకటిస్తారని తెలుస్తుంది. ఆ రోజే సినిమా ఫస్ట్ లుక్ కూడా విడుదల చేస్తారని అనుకుంటున్నారు. ఈ సినిమా యూరప్ నేపథ్యంలో ఉంటుంది. దీనికోసం ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన సెట్స్ ను హైదరాబాద్ లో వేస్తున్నారు. ప్రభాస్ ఇండియా వచ్చాక షూటింగ్ మొదలుపెట్టి 2020 వేసవిలో విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తుంది.Please Read Disclaimer