సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ !

0

2020 సంక్రాంతి సినిమా లవర్స్ చాలా స్పెషల్ గా మారింది. దీనికి కారణం మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ సినిమాలు సంక్రాంతి స్పెషల్ గా ఒకే రోజు థియేటర్స్ లోకి రానున్నాయి. అందుకే ఈ సినిమాల ప్రమోషన్స్ విషయంలో గట్టి పోటీ నెలకొంది.

అయితే ప్రమోషన్స్ విషయంలో మహేష్ ‘సరిలేరు’ కంటే బన్నీ ‘అల వైకుంఠపురములో’ చాలా ముందుంది. ఇప్పటికే రెండు పాటలు విడుదలై మిలియన్ వ్యూస్ తో దూసుకెళ్తు సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. సాంగ్స్ విషయం మాత్రం మహేష్ సినిమా మరీ స్లో అనిపించుకుంటుంది. ఇంత వరకూ ఈ సినిమాకు సంబంధించి సాంగ్స్ రిలీజ్ పై ఎలాంటి అప్డేట్ లేదు. ఓ వైపు బన్నీ సాంగ్స్ ట్రెండవుతుంటే మహేష్ సాంగ్స్ తో ఎపుడు హంగామా చేస్తాడా అంటూ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

అలా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి ఓ గుడ్ న్యూస్. ‘సరిలేరు’ ఫస్ట్ సింగిల్ రిలీజ్ కి డేట్ ఫిక్స్ చేశారట మేకర్స్. డిసెంబర్ 1 న మొదటి పాటను విడుదల చేసేందుకు ఇప్పటికే సన్నాహాలు జరుగుతున్నాయట. త్వరలోనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారని సమాచారమ్. మరి ఫస్ట్ సింగిల్ తో దేవి థమన్ ని డీ కొడతాడా చూడాలి.
Please Read Disclaimer