చాణక్య ఇండిపెండెన్స్ డే విషెస్

0

యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన గోపీచంద్ ప్రస్తుతం ‘చాణక్య’ అనే ఒక స్పై థ్రిల్లర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. జూన్ లో గోపీచంద్ పుట్టిన రోజు సందర్భంగా ‘చాణక్య’ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ రోజు ‘చాణక్య’ టీమ్ మరో పోస్టర్ రిలీజ్ చేసింది.

ఈ పోస్టర్ లో గోపీచంద్ టీషర్ట్.. దానిపైన డెనిమ్ షర్టు.. బ్లాక్ ప్యాంట్ ధరించి పిల్లర్ కు అనుకుని ఒక స్టైలిష్ పోజిచ్చాడు. గడ్డం లుక్ లో కళ్ళజోడు ధరించి సూపర్ హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్లోనే ప్రేక్షకులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయిందని త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ఫైనలైజ్ చేసే ప్రయత్నాలలో ఉన్నారట. రిలీజ్ డేట్ ను బట్టి ప్రమోషన్స్ కూడా ప్రారంభిస్తారట.

ఈ సినిమా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోందని.. ఈసారి గోపీచంద్ కు బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం ఖాయమని యూనిట్ మెంబర్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారట. ఈ సినిమాలో గోపీచంద్ కు జోడీగా మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తోంది. విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. వెట్రి ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్. ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళ డైరెక్టర్ తిరు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
Please Read Disclaimer