రవితేజ టైటిల్ తో గోపీచంద్ సినిమా

0

సినిమా ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు కొన్ని పాపులర్ టైటిల్స్ పై కొందరు నిర్మాతలు దర్శకులు కర్చీపు వేయడం సహజమే. అయితే ఆ మధ్య హరీష్ శంకర్ కూడా తన ‘డీజే’ సినిమాలో ఓ పాటలో వచ్చే ‘సీటి మార్’ అనే టైటిల్ ని పక్కనపెట్టుకున్నాడు. హీరో ఎవరో చెప్పకుండానే టైటిల్ అనౌన్స్ చేసాడు కూడా. ఆ తర్వాత రవితేజను పెట్టి ఈ పవర్ ఫుల్ టైటిల్ తో సినిమా ప్లాన్ చేసాడు. కానీ ఎందుకో వర్కౌట్ అవ్వలేదు.

ఇక ఆ టైటిల్ ను ఆ కథను పక్కన పెట్టి దాగుడు మూతలు అనే కథ సిద్దం చేసుకున్నాడు. అది కూడా వర్కౌట్ అవ్వకపోవడంతో చివరికి వరుణ్ తో ‘జిగార్తాండ’ ను రీమేక్ చేసాడు. అయితే ఇప్పుడు హరీష్ శంకర్ పక్కన పెట్టిన టైటిల్ ను గోపి చంద్ సినిమాకు పెట్టారు. సంపద్ నంది దర్శకత్వంలో గోపిచంస్ నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా సినిమాను ఇదే టైటిల్ తో తెరకెక్కిస్తున్నారు.

కథకు కనెక్ట్ అయ్యే టైటిల్ కావడం పైగా క్యాచీ టైటిల్ అవ్వడంతో హరీష్ ను బ్రతిమిలాడి తీసుకొని తన సినిమాకు పెట్టేసుకున్నాడట సంపద్ నంది. మరి ఈ టైటిల్ తో గోపీచంద్ కి ఎంత వరకూ కలిసొస్తుందో ?
Please Read Disclaimer