మ్యాచో హీరోకి అంత కాన్ఫిడెన్సా?

0

సాదారణంగా ఏదైనా పెద్ద సినిమా రిలీజ్ ఉన్నప్పుడు ఆ దరిదాపుల్లో మరో సినిమా ఉండవు. కానీ ‘సైరా’ లాంటి ప్యాన్ ఇండియా సినిమా రిలీజ్ అయిన రెండు రోజులకే గోపీచంద్ ‘చాణక్య’ విడుదలవుతుంది. ‘సైరా’ వస్తుందని తెలిసినా రిలీజ్ డేట్ ను పోస్ట్ పోన్ చేసుకోకుండా ఫిక్సయ్యారు మేకర్స్. ఇక మెగా స్టార్ కి ఎదురెళ్ళే దైర్యం గోపీచంద్ కి ఎక్కడి నుండి వచ్చింది అనుకున్నారంత. కట్ చేస్తే గోపీచంద్ ఇక వేరే డేట్ లేకపోవడం పైగా దసరా సెలవలు కావడంతోనే ఆ డేట్ ఫైనల్ చేసుకున్నామని కూల్ గా చెప్పాడు.

అయితే లేటెస్ట్ గా వైజాగ్ ఈవెంట్ లో గోపీచంద్ తనలోని కాన్ఫిడెన్స్ ని బయటపెట్టి మాట్లాడాడు. గట్టిగా అరుస్తూ ఈ సారి ఓ హిట్ సినిమా ఇస్తున్నా అన్నాడు. అభిమానులు తనపై చూపిస్తున్న ప్రేమను మళ్ళీ ఈ సినిమాతో తిరిగి ఇచ్చేస్తున్నాని చెప్పుకున్నాడు. ఏ ఫంక్షన్ లో అయినా కాంగా ఉంటూ మెల్లగా మాట్లాడే గోపీచంద్ ఈసారి ఈవెంట్ లో గట్టిగా అరిచే సరికి గోపిచంద్ లో ఏదో మార్పు వచ్చిందని అక్కడున్న వారు కూడా అనుకున్నారు. ఇక కొందరైతే ఈవెంట్ కి వచ్చిన జనాలను చూసి ఉత్సాహంతోనే గోపి అలా అరిచి ఉంటాడని లైట్ తీసుకున్నారు.

నిజానికి ఇప్పుడు గోపీచంద్ హిట్టు కొట్టడం చాలా ముఖ్యం. చాణక్య తో హిట్టు కొట్టి మళ్ళీ తన మార్కెట్ ను పెంచుకోవాలని చూస్తున్నాడు. పైగా నెక్స్ట్ రెండు సినిమాలున్నాయి. వాటి బిజినెస్ కూడా ఈ సినిమా మీద ఆధారపడి ఉంటుంది. అందుకే చాణక్య పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ తోనే స్పీచ్ ఇచ్చాడు. మరి ఈ మ్యచో హీరో ఈసారైనా హిట్టు కొడతాడేమో చూడాలి.
Please Read Disclaimer