చాణక్య: కాంపిటిషన్ ఫుల్లు.. ప్రమోషన్స్ నిల్లు!

0

మాచో హీరో గోపీచంద్ త్వరలో స్పై థ్రిల్లర్ ‘చాణక్య’ తో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. తమిళ దర్శకుడు తిరు రూపొంచిందిన ఈ సినిమా ట్రైలర్ ఆసక్తిని రేకెత్తించింది కానీ ప్రమోషన్స్ విషయంలో మాత్రం ‘చాణక్య’ టీమ్ వెనుకబడింది. ఈ సినిమా రిలీజ్ అయ్యేది మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ విడుదలైన మూడు రోజులకే.. అంటే అక్టోబర్ 5 వ తేదీన రిలీజ్ అవుతోంది.

ఇప్పటివరకూ ఈ సినిమాకు కొంచెం అయినా పబ్లిసిటీ వచ్చింది అంటే.. “చిరు ‘సైరా’ కు పోటీగా రిలీజ్ చేస్తున్నారు” అనే వార్తే దానికి కారణం. లేకపోతే ‘చాణక్య’ సినిమా రిలీజ్ అవుతుందనే విషయం మెజారిటీ ప్రేక్షకులకు తెలిసేది కాదేమో. ఇప్పుడు కూడా ప్రమోషన్స్ దాదాపుగా లేవు. గోపిచంద్ కెరీర్ గత కొన్నేళ్ళుగా డౌన్ లో ఉంది. వరస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పుడు స్ట్రాంగ్ ప్రమోషన్స్ చేయకపోతే ప్రేక్షకులకు సినిమా రీచ్ కావడం కష్టమే. ఈ సినిమాకు మరో సమస్య ఏంటంటే ‘సైరా’ తో పోటీ అనేసరికి బయ్యర్లు ఎవరూ ముందుకు రాలేదు.. సరైన థియేటర్లు దొరుకుతాయా లేదా అనేది కూడా సందేహంగానే ఉంది. వీటికి తోడు ప్రేక్షకుల దృష్టి అంతా ‘సైరా’ మీదే ఉంటుంది. మెజారిటీ తెలుగు ఆడియన్స్ ‘సైరా’ చూడాలనే ఆలోచనలోనే ఉంటారు.

ఇలాంటి పరిస్థితుల్లో ‘సైరా’ సునామీకి ‘చాణక్య’ నిలబడగలడా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికైనా ‘చాణక్య’ టీమ్ ముందుచూపుతో ప్రమోషన్స్ లో జోరు పెంచితే పండగ సీజన్ కు ఉండే ఎడ్వాంటేజి ఉపయోగించుకునే వీలు చిక్కుతుంది. ఇక 5 వ తారీఖు ఈ సినిమా రిలీజ్ అయ్యేలోపు ఫిలిం మేకర్స్ ఎలా ప్రమోషన్స్ ను ముందుకు తీసుకెళ్తారో వేచి చూడాలి.
Please Read Disclaimer