#2020లో గోపిచంద్ ప్లాన్స్ ఇవే

0

అగ్రెస్సివ్ హీరో గోపీచంద్ కెరీర్ వరుస వైఫల్యాల గురించి తెలిసిందే. గత రెండేళ్లుగా గోపీకి అస్సలు కలిసి రావడం లేదు. ఆన్ లొకేషన్ ఊహించని యాక్సిడెంట్ కొంత ఇబ్బంది పెట్టింది. ఇక ఇటీవలే రిలీజైన చాణక్య బక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా ఫ్లాపైంది. 2019 ఏ రకంగానూ ఈ హీరోకి కలిసి రాలేదు. అందుకే 2020లో సరికొత్త ప్రణాళికలతో దూసుకొచ్చే ప్లాన్ లో ఉన్నాడట.

ప్రస్తుతం గోపిచంద్ – మాస్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్ లో భారీ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మిల్కీబ్యూటి తమన్నా హీరోయిన్గా నటిస్తుండగా మరో హీరోయిన్ గా దిగంగన సూర్యవంశీ నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తుండగా భూమిక- రావు రమేష్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. ఈ షెడ్యూల్ లో అజిజ్ నగర్ లో వేసిన భారీ సెట్లో కీలక సన్నివేశాలు చిత్ర్రీకరించారు. త్వరలో మరో షెడ్యూల్ ప్రారంభం కానుంది. అన్నికార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ సమ్మర్ కి ప్రేక్షకుల ముందుకి రానుంది.

ఇక ఈ సినిమా పూర్తయ్యే లోగానే మరో రెండు స్క్రిప్టుల్ని గోపిచంద్ లాక్ చేయనున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే పలువురు దర్శకులు కథలు వినిపించారట. అయితే వాటికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. అలాగే 2020 ఆగస్టు నాటికి గోపిచంద్ కెరీర్ రెండు దశాబ్ధాలు పూర్తి చేసుకోనుంది. అంటే కెరీర్ రెండు దశాబ్ధాలు పూర్తవుతున్న సందర్భంగా ఆగస్టులో గోపి సెలబ్రేషన్స్ స్పెషల్ గా ఉంటాయన్నమాట.
Please Read Disclaimer