గోపీ వారసులు.. ముచ్చటైన గోపాల కృష్ణులు

0

అవును.. ఈ ఫోటో చూడగానే గోపీకి ఇద్దరు ముచ్చటైన గోపాల కృష్ణులు ఉన్నారా? అంటూ ఆశ్చర్యపోవాల్సిందే. పద్ధతిగా సాంప్రదాయ బద్ధంగా అందంగా ముస్తాబై ఫ్యామిలీ ఫోటోలో ఎంత ముద్దొస్తున్నారో కదూ? వీళ్ల డీటెయిల్స్ లోకి వెళితే చాలా ఆసక్తికర సంగతులే తెలిశాయి.

ఎగ్రెస్సివ్ హీరో గోపిచంద్ 12 మే 2013లో రేష్మను పెళ్లాడారు. రేష్మకు ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ ఉంది. శతాధిక చిత్రాల హీరో శ్రీకాంత్ కి కోడలు వరుస. గోపిచంద్ – రేష్మ జంటకు మొదటి కుమారుడు విరాట్ కృష్ణ. వయసు ఐదేళ్లు. రెండో కొడుకు వియాన్. వయసు ఏడాది. తొలి బర్త్ డేని ఇటీవలే వేడుకగా జరుపుకున్నాడు. ఈ వేడుకలకు గోపీచంద్ స్నేహితుడు ప్రభాస్ హాజరయ్యారు. అలాగే పలువురు టాలీవుడ్ స్టార్లు ఎటెండయ్యారు.

గోపీచంద్ భార్య రేష్మ ఇటీవల కాస్త బరువు తగ్గారని తాజాగా రివీలైన ఫోటో చెబుతోంది. ఇద్దరు సుపుత్రులకు మామ్ అయినా మునుపటితో పోలిస్తే స్లిమ్ గా ఉన్నారు. చూస్తుండగానే వారసులు ఎదిగేస్తున్నారు. దీపావళి సందర్భంగా ఈ ఫోటో ఫ్యాన్స్ సోషల్ మీడియాలోకి వచ్చి జోరుగా వైరల్ అవుతోంది.
Please Read Disclaimer