వైట్ బోట్ లో హాట్ క్యాట్

0

హిందీ హీరోయిన్ల లో కత్రినా కైఫ్ కు ఇప్పటికీ క్రేజ్ ఎక్కువే. సీనియర్ హీరోయిన్ అయి ఉండి కూడా ఇంకా టాప్ హీరోల సినిమాల్లో నటిస్తూ కొత్త తరం హీరోయిన్ల కు అసూయ కలిగేలా చేస్తోంది. ఇక గ్లామర్ విషయంలోనూ.. సోషల్ మీడియాలో మంటలు పెట్టే విషయంలోనూ కత్రినా ఎవరి కీ తీసి పోదు. కత్రినా ఫోటో ఏదైనా ఒకటి బయటకు వస్తే చాలు వెంటనే వైరల్ అవుతుంది.

ఈ మధ్య కత్రినా సముద్ర ప్రయాణం చేస్తూ ఒక అందమైన శ్వేత వర్ణపు పడవ లో అలా నడుస్తూ రెండు ఫోటోలు తీయించుకుంది. బ్లాక్ కలర్ డిజైన్ ఉండే ఒక లైట్ కలర్ బికినీ ధరించి పైనేమో బొత్తాలు వేసుకోకుండా వైట్ షర్టు ధరించి పోజులిచ్చింది. జుట్టు చిందరవందరగా ఉండడంతో యామా హాటుగా కనిపిస్తోంది. కత్రినా మొదటి నుంచి సూపర్ ఫిట్ గా ఉండే భామ.. పైగా పొడవు కాళ్ళ సుందరి అని పేరు. అందుకేనేమో కత్రినా తన కాళ్ళ అందాలను ప్రదర్శిస్తూ నెటిజన్లను కవ్వించే ప్రయత్నం చేసింది. నేపథ్యంలో సముద్రం ఈ ఫోటో అందాన్ని మరింతగా పెంచింది.

నిజాకి అందంగా చాలామంది ఉంటారు కానీ దానికి తగ్గ బాడీ లాంగ్వేజ్ ఉండదు. కానీ కత్రినా దగ్గర ఆ స్టైల్ టన్నులలో ఉంది. అందుకే ఎలాంటి డ్రెస్ వేసుకున్నా సూట్ అవుతుంది. అది చీర అయినా.. చుడిదార్ అయినా.. ప్యాంట్ షర్టు అయినా.. స్కర్ట్ అయినా.. లేక బికినీ అయినా. అందుకే కత్రినా క్రేజ్ ఎప్పుడూ పీక్స్ లో ఉంటుంది. ఇక కత్రినా సినిమాల విషయానికి వస్తే అక్షయ్ కుమార్ చిత్రం ‘సుర్యవంశి’ లో హీరోయిన్ గా నటిస్తోంది. రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అజయ్ దేవగణ్.. రణవీర్ సింగ్ ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు.
Please Read Disclaimer