లేడీ ఓరియెంటెడ్ పుట్టి ముంచదా పూజా?

0

అగ్ర కథానాయికలు.. యువనాయికలు అనే తేడా లేకుండా భామలంతా సాధ్యమైనంత వరకు విభిన్నమైన పాత్రల్ని ట్రై చేస్తున్నారు. గ్లామరస్ పాత్రలతో పాటు ఛాన్స్ చిక్కినప్పుడల్లా తమలోని నటిని సంతృప్తి పరిచే ప్రయత్నం చేస్తున్నారు. అనుష్క- నయనతార- సమంత- పాయల్ రాజ్పుత్ లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తున్నారు. మిగిలిన హీరోయిన్లు ఇప్పుడిప్పుడే ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. వీరి జాబితాలో గ్లామర్ బ్యూటీ పూజా హెగ్డే కూడా చేరబోతుంది. త్వరలో బుట్ట బొమ్మ ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటించబోతున్నట్టు తెలుస్తోంది.

ఇటీవల `అల వైకుంఠపురములో`తో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకున్న ఈ బుట్టబొమ్మ ఇప్పుడు ప్రభాస్ సరసన జాన్ చిత్రంలో నటిస్తుంది. దీనికి రాధాకృష్ణ దర్శకుడు. దీంతోపాటు అఖిల్ `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్..లో అలాగే త్రివిక్రమ్- ఎన్టీఆర్ కాంబినేషన్ చిత్రంలోనూ నటిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా పూజాకి ఓ డిఫరెంట్ ఆఫర్ వచ్చింది. గ్లామరస్ పాత్రలతో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మకి లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో ఆఫర్ వచ్చిందట.

అందాల రాక్షసి- కృష్ణగాడి వీర ప్రేమగాథ- లై- పడి పడి లేచే మనసు వంటి చిత్రాలను రూపొందించిన దర్శకుడు హను రాఘవపూడి ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రాన్ని రూపొందించేందుకు స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నాడు. ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డేను తీసుకునే ఆలోచనలో హను ఉన్నారట. తన పాత్రకి ఆమె బాగా సూట్ అవుతుందని భావిస్తున్నాడు. పూజాని ఈ విషయంపై సంప్రదించగా.. ప్రాథమికంగా ఓకే చెప్పిందని టాక్. అధికారికంగా పూర్తి క్లారిటీగా పూజా ఇంకా అనుమతి ఇవ్వాల్సి ఉందట. ఇదే నిజమైన తొలిసారి పూజాని ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో చూసే ఛాన్సుంది అభిమానులకు. మరి ఈ గ్లామర్ భామ ఫీమేల్ సెంట్రిక్ మూవీ చేశాక.. గ్లామరస్ పాత్రలు చేస్తుందా ? వదిలేస్తుందా? అనే కొత్త సందేహాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. పూజాలోని అందాల నిధిని తవ్వి చూడలేమేమో అన్న ఆందోళన కనిపిస్తోంది. మరోవైపు లేడీ ఓరియెంటెడ్ కలిసొస్తే ఓకే కానీ.. ఫెయిలైతే మరో కీర్తి సురేష్ లా అవుతుందేమో! అన్న దిగులు కనిపిస్తోంది ఫ్యాన్స్ లో.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-