యంగ్ హీరో సిన్మాకి ఆదిలోనే కష్టాలే?

0

వరుస ప్లాప్ లతో సతమతమవుతోన్న యంగ్ హీరో ఇటీవలే ఓ సినిమా తో హిట్టు అందుకున్నాడు. ఆ విజయం మంచి బూస్ట్ ఇచ్చింది. మళ్లీ రేసులోకి వచ్చే ప్రయత్నాల్లో బిజీ అయ్యాడు. ఈ నేపథ్యంలో ఓ స్టార్ తో సినిమా మొదలు పెట్టాడు. ప్రస్తుతం ఆ సినిమా సెట్స్ లో ఉంది. వారం రోజులు క్రితమే బర్త్ డే సందర్భం గా ఆ సినిమా విశేషాలను సైతం మీడియా తో పంచుకున్నాడు. సినిమా పై అంతా కాన్ఫిడెంట్ గా ఉన్నామని ..మరో సారి సక్సెస్ కి దగ్గర్లోనే ఉన్నామని ధీమా వ్యక్తం చేసాడు. అయితే ఇంత లోనే ఏం జరిగిందో తెలియదు. ఆ చిత్ర దర్శకుడు- సినిమాటోగ్రాఫర్ మధ్య వివాదం తలెత్తిందన్న వార్త వెడెక్కిస్తోంది.

ఇద్దరి మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ న్ అందుకు కారణంగా వినిపిస్తోంది. దర్శకుడు ఆ ఛాగ్రాహకుడిని ఏరికోరి మరీ బాలీవుడ్ నుంచి తీసుకొచ్చాడు. బాలీవుడ్ లో అగ్ర హీరోలు నటించిన పలు బ్లాక్ బస్టర్ సినిమాలకు పనిచేసిన అనుభవం ఉంది. బెస్ట్ కెమెరామెన్ గాను కీర్తింపబడ్డ టెక్నీషియన్. అందుకే పట్టుబట్టి మరి టాలీవుడ్ కి దిగుతతి చేసాడు. కానీ తలెత్తిన క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా షూటింగ్ మధ్యలోనే అర్ధంతరం గా వెళ్లి పోయాడుట. ప్రస్తుతం ఈ విషయాలు పరిశ్రమ లో హాట్ టాపక్ గామరాయి.

ఈ సన్నివేశంతో ఆ దర్శకుడు మరో సీనియర్ టెక్నీషియన్ ని రంగంలోక దింపారుట. ఆయన బిజీగా ఉన్నప్పటికీ ఆ హీరో నిర్మాతతో ఉన్న అనుబంధం కారణంగా డేట్లు అడ్జస్ట్ చేసినట్లు సమాచారం. పని కూడా మొదలు పెట్టేసారుట. అయితే ఇంకా సవ్యంగా షూటింగ్ జరగలేదని… షూటింగ్ లో సీరియస్ నెస్ వచ్చిన తర్వాత ఓ క్లారిటీ రానుందని సమాచారం. అతి త్వరలోనే ఆ కొత్త సినిమా టోగ్రాఫర్ పేరుని అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం. అలాగే ఆ పేరుతో పాటు మిగతా టెక్నీకల్ టీమ్..ఇతర నటీనటుల వివరాలు కూడా వెల్లడించనున్నారుట.
Please Read Disclaimer