సాయిపల్లవి మ్యారేజ్ రూమర్లు.. ఫ్యాన్స్ గుస్సా

0

సాయి పల్లవి పేరును తెలుగు ప్రేక్షకులకు అసలు పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే శేఖర్ కమ్ముల తన ‘ఫిదా’ సినిమాకోసం భానుమతి పాత్రను డిజైన్ చేస్తే.. సాయి పల్లవి కాస్తా ఆ పాత్రలో నటించకుండా జీవించి తెలుగు ప్రేక్షకులను మాయచేసేసింది. ఆ సినిమా తర్వాత సాయి పల్లవి మరో సూపర్ హిట్ అందుకోలేదు కానీ ఇప్పటికీ సాయి పల్లవికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈమధ్య కోలీవుడ్ లో సాయి పల్లవిపై పెళ్ళి వార్తలు వస్తున్నాయి.

సాయిపల్లవి కోలీవుడ్ డైరెక్టర్ ఎఎల్ విజయ్ ను త్వరలో వివాహం చేసుకోబోతోందని కోలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఎఎల్ విజయ్ పేరు తెలుసు కదా? హాట్ బ్యూటీ అమలా పాల్ ప్రేమలో పడి.. పెళ్ళి చేసుకొని.. విడాకులు తీసుకున్నాడు. ఆయనే. సాయి పల్లవి లీడ్ రోల్ లో నటించిన ‘కణం’ సినిమాకు దర్శకుడు. ‘కణం’ సినిమా షూటింగ్ సమయంలో.. ఓ క్షణంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని.. ఇప్పుడు అది పెళ్ళికి దారితీస్తోందని తమిళ మీడియా కోడై కూస్తోంది. ఈ విషయంపై అటు ఎల్ విజయ్ కానీ ఇటు సాయి పల్లవి కానీ ఇంతవరకూ స్పందించలేదు.

ఈ వార్తలపై అప్సెట్ అయిన సాయి పల్లవి ఫ్యాన్స్ మాత్రం ఇవన్నీ గాసిప్స్ అని కొట్టిపారేస్తున్నారు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో సాయిపల్లవిని పెళ్ళి విషయం అడిగితే అసలు జీవితంలోపెళ్లి చేసుకునే ఆలోచన లేదని తేల్చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మరి సాయి పల్లవి ఈ వార్తలపై ఏమంటుందో వేచి చూడాలి.
Please Read Disclaimer