సూపర్ హిట్ మూవీ పై ఇలా నోరు పారేసుకోవడం ఏంటీ?

0

విభిన్న చిత్రాల దర్శకుడి గా పేరున్న గౌతమ్ మీనన్ ‘తూట’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. ధనుష్ హీరోగా నటించిన ఈ చిత్రం కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయ్యింది. లేట్ అయినా కూడా సినిమాపై తమిళ మరియు తెలుగు ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. తూట ప్రమోషన్ లో భాగంగా ఒక మీడియా సంస్థ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో గౌతమ్ మీనన్ మాట్లాడాడు. ఈ సందర్బంగా ఆయన ఏమాయ చేశావె చిత్రంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

నాగచైతన్య.. సమంత జంటగా నటించిన ‘ఏమాయ చేశావె’ సినిమాకు ఒరిజినల్ వర్షన్ తమిళ ‘విన్నైతాండి వరువాయ’. ఒరిజినల్ వర్షన్ క్లైమాక్స్ కు తెలుగు వర్షన్ క్లైమాక్స్ కు తేడా ఉంటుంది. అసలు కథ ప్రకారం చివర్లో హీరో హీరోయిన్ కలవరు. కాని తెలుగు ఏమాయ చేశావె సినిమాలో మాత్రం హీరో హీరోయిన్ కలిసి పోయి పెళ్లి చేసుకున్నట్లుగా ఉంటుంది. ఒరిజినల్ వర్షన్ యావరేజ్ గా నిలవగా.. క్లైమాక్స్ మార్చినందుకు గాను తెలుగులో ఏమాయ చేశావె చిత్రం సూపర్ హిట్ అయ్యింది. సూపర్ హిట్ అయిన ఏమాయ చేశావె చిత్రం పై దర్శకుడు గౌతమ్ మీనన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

క్లైమాక్స్ ను నాతో బలవంతం గా మార్పించారు. అలా చేయడంతో అసలు అది సినిమానే కాకుండా పోయిందని నా అభిప్రాయం.. ఆ సినిమా సక్సెస్ అయినా నాకు మాత్రం సంతృప్తి లేదంటూ వ్యాఖ్యలు చేశాడు. దర్శకుడిగా ఆ క్లైమాక్స్ కోసం రాజీ పడటం తో నా పై నాకే కోపం వచ్చిందని గౌతమ్ అన్నాడు. క్లైమాక్స్ ఆయన అనుకున్నట్లు గా పెట్టిన సినిమా యావరేజ్ అవ్వగా మార్చిన సినిమా హిట్ అయినా కూడా ఇలా నోరు పారేసుకోవడం ఏమాత్రం బాగాలేదు అంటూ అక్కినేని అభిమానులు అంటున్నారు.

ఏమాయ చేశావె సినిమా నిర్మాత మహేష్ బాబు సోదరి మంజుల. ఆమె తెలుగు ప్రేక్షకుల అభిరుచి కి తగ్గట్లు గా క్లైమాక్స్ సుఖమయం అవ్వాలని దర్శకుడు గౌతమ్ తో పట్టుబట్టింది. ఆ సమయంలో ఆమె పట్టుబట్టి క్లైమాక్స్ ను పాజిటివ్ గా సుఖమయం గా చేయడం వల్లే ఏమాయ చేశావె సినిమా అంతగా సక్సెస్ అయ్యిందని ఇప్పటికి కొందరు అంటున్నారు. ఆ రోజు మంజుల పట్టుబట్టి ఉండకుంటే ఏమాయ చేశావె తమిళంలో మాదిరిగానే తెలుగు లో కూడా ఫ్లాప్ అయ్యేది. ఒక సినిమా ఫ్లాప్ కాకుండా హిట్ అయ్యేలా ఐడియా ఇచ్చిన వారిని అభినందించాల్సింది పోయి ఇలా బదనాం చేస్తారేంటి గౌతమ్ గారు అంటూ తెలుగు ప్రేక్షకులు ఆయన పై విమర్శలు గుప్పిస్తున్నారు.
Please Read Disclaimer