సాహో ఈవెంట్ .. ఇవిగో ఏర్పాట్లు చూశారా?

0

సాహో వెహికల్స్ వరల్డ్ ఎలా ఉంటుందో చూడాలని ఎగ్జయిట్ అవుతున్నారా? అయితే అందుకు ఇంకెంతో సమయం లేదు. సాయంత్రం 6గం.ల నుంచే రామోజీ ఫిలింసిటీలో సాహో అసలైన సంబరం ప్రారంభమవుతోంది. నెవ్వర బిపోర్ అనే తీరుగా ఈ ప్రీరిలీజ్ వేడుక కోసం ఏకంగా 2 కోట్ల తో సాహో వరల్డ్ పేరుతో భారీ సెట్లు వేశారు. ఇక్కడ హైటెక్ కార్లు.. బైక్ లు.. ట్యాంకర్ దర్శనమీయనున్నాయి. ఒక స్పెషల్ వోల్ట్ డిస్ ప్లే ట్విస్టివ్వనుందని తెలుస్తోంది.

ఫిలింసిటీలో వేదిక ఇప్పటికే పక్కాగా సిద్ధమైంది. వేదికను కొన్ని ఎకరాల విస్తీర్ణంలో అత్యంత భారీగా సిద్ధం చేశారు. ఇక్కడ గాల్లో సాహో బెలూన్లు నింగిలో ఎగురుతూ కనిపిస్తున్నాయి. వేదిక వద్ద వీవీఐపీ గ్యాలరీలో కుర్చీలు రెడీ అయిపోయాయి. దీనికోసం ఏకంగా భారీ క్రేన్లను ఉపయోగించినట్టు స్పాట్ లో సీన్ చెబుతోంది. ఇక డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ లక్ష మంది వేదిక ముందుకు దూసుకురాబోతున్నారు కాబట్టి వీళ్లను నిలువరించేందుకు భారీగా బారికేడ్లను వేశారు. ఇక్కడ పోలీస్ బందోబస్తు భారీగానే ఉండనుందని తెలుస్తోంది. నేటి సాయంత్రం 6 దాటితే రామోజీ ఫిలింసిటీ కిటకిటలాడడం ఖాయంగా కనిపిస్తోంది. ఓవైపు బయట మబ్బు వాతావరణం ఉన్నా.. చీకటిని చీల్చే వెలుతురు చినుకుల్లా డార్లింగ్ ఫ్యాన్స్ దూసుకొస్తున్నారన్నది తాజా వార్త.

వేదిక మీదికి ఎవరూ దూసుకురాకుండా అవాంచనీయ ఘటనలు జరగకుండా చూసారు కదా ఆ ఏర్పాట్లు.. భారీగా ఇనుప చువ్వలతో చుట్టూ సపరేషన్ చేశారు. ఇక వీవీఐపీ.. వీవీఎంఐపీ.. కామన్ మ్యాన్ గ్యాలరీ.. ఇలా డివైడ్ చేశారు. సాయంత్రం 6 తర్వాత ఈవెంట్ అయినా 3గంటల నుంచే తెలుగు సినిమా మీడియాను రామోజీ ఫిలింసిటీకి వాహనాల్లో తరలిస్తున్నారు. ఫ్యాన్స్ రాక మొదలైనప్పటి నుంచి పోలీసులకు తాకిడి ఎక్కువగా ఉంటుందనడంలో సందేహం లేదు. ఈ ఈవెంట్ తర్వాత కొచ్చి.. మైసూర్ ఈవెంట్లు జరగనున్నాయి. దుబాయ్ లో ఓ భారీ ఈవెంట్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఆగస్టు 30 రిలీజ్ తేదీ.. అంటే మరో 12రోజుల సమయమే మిగిలి ఉంది.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home