నాగ్ 60కి గ్రాండ్ సెలబ్రేషన్స్

0

ఎవరైనా సరే అరవై వయసు వచ్చిందంటే ఆడ మగ తేడా లేకుండా శరీరం ఎలాంటి మార్పులకు లోనై ఎలా మారతారో తెలిసిందే. కాని దీనికి పూర్తి మినహాయింపుగా ప్రేక్షకులు భావించే అక్కినేని నాగార్జున త్వరలో అరవై పడిలోకి అడుగు పెడుతున్నారు. వచ్చే ఆగస్ట్ 29 నాగ్ పుట్టిన రోజు ఆ ల్యాండ్ మార్క్ కి వేదిక కాబోతోంది. ఇప్పటికీ మన్మధుడు అనే ట్యాగ్ కి సార్థక నామదేయుడిగా నిలుస్తున్న నాగార్జున పుట్టినరోజు వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారట.

వేదిక తదితర వివరాలు త్వరలో తెలుస్తాయి. అప్పటికే మన్మథుడు 2 రిలీజై పోయి ఉంటుంది కాబట్టి సక్సెస్ మీట్ ప్లస్ బర్త్ డే సెలెబ్రేషన్స్ కంబైన్డ్ జరిగేలా ప్లాన్ చేస్తున్నారట. విక్రమ్ తో మొదలుపెట్టిన నాగార్జున జైత్రయాత్ర అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. గత రెండు మూడేళ్లుగా సక్సెస్ లేని నాగ్ మన్మథుడు 2 మీద మాములు అంచనాతో లేరు.కేవలం ఆరు రోజుల గ్యాప్ తో సాహో వస్తున్నా లెక్క చేయకుండా రిలీజ్ కు డిసైడ్ అయ్యారు.

ఇప్పటికే టీజర్స్ మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. త్వరలో ఆడియో విడుదల చేయబోతున్నారు. చివరి వారంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది. ఈలెక్కన ఆగస్ట్ చివరివారం తన బర్త్ డే దాకా నాగ్ యమా బిజీగా ఉండేలా కనిపిస్తున్నాయి షెడ్యూల్స్. 60వ పుట్టినరోజును చాలా గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్న చిరంజీవి తరహాలో నాగ్ మనసులో ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయో ఏమో ఇంకొంత కాలం ఆగితే తెలుస్తుంది.
Please Read Disclaimer