గృహ లక్ష్మి కవర్ పేజి.. దీపిక-లక్ష్మి

0

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనె తాజా చిత్రం ‘ఛపాక్’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మేఘన గుల్జార్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమాకు నిజ జీవిత సంఘటనలు ఆధారం. యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మి అగర్వాల్ బయోపిక్ ఇది. పోయిన నెలలో రిలీజ్ అయిన ఛపాక్ ట్రైలర్ పలువురి ప్రశంసలు అందుకుంది. సినిమా థీమ్ చాలా పవర్ఫుల్ కావడంతో ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని కలుగజేసింది.

ఇదిలా ఉంటే దీపిక రీసెంట్ గా తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు “ఈ నూతన సంవత్సరాన్ని మాల్టి ధైర్యం.. నమ్మకంతో ప్రారంభించండి. మాల్టి జీవితానికి సంబంధించిన అద్భుతమైన ప్రయాణంతో పాటుగా #ఛపాక్ కథను గృహలక్ష్మి జనవరి ఎడిషన్లో తెలుసుకోండి” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ‘ఛపాక్’ సినిమాలో దీపిక పాత్ర పేరు మాల్టి. ప్రముఖ హిందీ మ్యాగజైన్ గృహలక్ష్మి కవర్ పేజి పైన ఉన్న ఫోటోనే ఇది. ఇందులో యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మి అగర్వాల్ తో కలిసి దీపిక పోజిచ్చింది.

హీరోయిన్లు అందంగా రెడీ కావడం.. కవర్ పేజికోసం హాటు పోజులు ఇవ్వడం రెగ్యులర్ గా జరిగే వ్యవహారమే. అయితే ఈ కవర్ పేజి మాత్రం ఎంతో ప్రత్యేకమైనది. తన తప్పేమీ లేకపోయినా యాసిడ్ దాడి కారణంగా జీవితంలో ఇబ్బందులు ఎదుర్కోవడం కంటే కష్టం మరొకటి లేదు. అలాంటి పరిస్థితిలో కూడా మొక్కవోని ధైర్యంతో పోరాడి జీవితంలో గెలవడం.. నలుగురికి ప్రేరణగా నిలవడం ఎంతో గొప్ప విషయం. అలాంటి లక్ష్మి అగర్వాల్ తో కవర్ పేజిపై దీపిక పోజివ్వడం అందరినీ మెప్పిస్తోంది.
Please Read Disclaimer