సైరాకు జీఎస్టీ పోటు భారీగా పడిందట

0

సినిమా నిర్మాణం లో భారీ ఎత్తున చర్చ జరిగి.. అనుకున్నంత స్థాయి లో ఆదరణ సాధించ లేకపోయిన రెండు చిత్రాలు 2019లోనే విడుదలయ్యాయని చెప్పాలి. నిర్మాణం లో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం లభించినా.. ప్రేక్షకాదరణ విషయంలో పాజిటివ్ గా లేని చిత్రాలుగా సాహో.. సైరాలు నిలిచాయని చెప్పక తప్పదు. బాహుబలి స్థాయిలో కాకున్నా.. కలెక్షన్లు భారీగా సాధిస్తామన్న నమ్మకాన్ని దెబ్బ తీశాయి ఈ రెండు సినిమాలు.

తన తండ్రి కి అత్యద్భుతమైన సినిమాను అందించాలన్న తపనతో చిరు తనయుడు చెర్రీ అలియాస్ రాం చరణ్ నిర్మించిన సైరాకు అనుకోని రీతిలో షాక్ తగిలినట్లు చెబుతున్నారు. ఈ చారిత్రక చిత్రానికి సంబంధించి మెగాస్టార్ కుటుంబానికి మరో షాక్ తగిలినట్లు గా తెలుస్తోంది.

జాతీయ స్థాయి లో ఈ చిత్రం రికార్డు కలెక్షన్లను వసూలు చేస్తుందన్న అంచనా ఎంతలా ఫెయిల్ అయ్యిందో తెలిసిందే. ఇదిలా ఉంటే.. సాధారణంగా స్వాతంత్ర్య సమరయోథుల కథల్ని తెరకెక్కించినప్పుడు ప్రభుత్వాల నుంచి పన్ను మినహాయింపు లభిస్తుంది. ఆశ్చర్యకరంగా సైరాకు జీఎస్టీ ఊరట లభించలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ చిత్రానికి జీఎస్టీ మినహాయింపు ఇవ్వలేదు. దీంతో.. దగ్గర దగ్గర రూ.20 కోట్ల మేర జీఎస్టీ చెల్లించినట్లుగా తెలుస్తోంది. అసలే కలెక్షన్లు వీక్ గా ఉన్న వేళ.. రూ.20 కోట్ల భారీ మొత్తాన్ని జీఎస్టీ రూపం లో కట్టాల్సి రావటం మెగా ఫ్యామిలీ కి షాక్ గా చెప్పక తప్పదు.
Please Read Disclaimer