దొరసానితో గల్లీ పోరడు

0

హైదరాబాదీ గల్లీ బాయ్ అంటూ చెప్పుకునే రాహుల్ సిప్లిగంజ్ అనూహ్యంగా బిగ్ బాస్ సీజన్ 3 విజేతగా నిలిచిన విషయం తెల్సిందే. బిగ్ బాస్ విన్నర్ అయిన తర్వాత రాహుల్ చాలా బిజీ అయ్యాడు. మ్యూజిక్ ఆల్బమ్స్ చేయడంతో పాటు సినిమాలకు పాటలు పాడటం.. లైవ్ షోలు ఇవ్వడం ఇంకా బిజీ బిజీ అయ్యాడు. ఇదే సమయంలో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తన రంగమార్తాండ చిత్రంలోని ఒక కీలక పాత్ర కోసం రాహుల్ కు పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చాడట.

ఇదే సినిమాలో దొరసాని చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం అయిన జీవిత రాజశేఖర్ ల గారాల చిన్న కూతురు శివాత్మిక కూడా నటిస్తున్న విషయం తెల్సిందే. సినిమాలో వీరిద్దరి పాత్రలు ఏంటో తెలియదు కాని.. వీరి కాంబినేషన్ లో చాలా సీన్స ఉంటాయని వీరిద్దరి సీన్స్ సినిమాకు చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటాయంటూ యూనిట్ సభ్యులు అనధికారికంగా చెబుతున్నారు.

ఇటీవలే వీరిద్దరు కలిసి రంగమార్తాండ చిత్రం షూటింగ్ లో పాల్గొన్నారు. ఆ సందర్బంగా సరదాగా తీసుకున్న ఈ ఫొటోను రాహుల్ సిప్లిగంజ్ ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. దొరసానితో గల్లీ హీరో అంటూ రాహుల్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. వీరిద్దరి కాంబోలో హీరో హీరోయిన్ గా ఒక ఫుల్ లెంగ్త్ లవ్ స్టోరీ మూవీ కావాలంటూ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి అది నెరవేరేనా అనేది రంగమార్తాండ సినిమా ఫలితాన్ని బట్టి ఉంటుంది.