కంగనా ఇంటి సమీపంలో తుపాకీ కాల్పులు.. పక్కా ‘ప్లాన్’తోనేనా..??

0

బాలీవుడ్ ఇండస్ట్రీలో తన మనసుకు ఏదనిపిస్తే అది ముఖం మీదే చెప్పేయడం బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ తీరు. అందరూ బాగా పొగరుంది అనుకుంటే కంగనా మాత్రం కేవలం ముక్కుసూటితనమే అంటుంది. ఆమె తీరు కొందరికి నచ్చుతుంది కానీ ఆ ముక్కుసూటితనమే కొన్నిసార్లు వివాదాలలోకి నెట్టేస్తుంది. అలాగని తీరు మార్చుకునే రకం కాదు. కంగనా ఇటీవలే సుశాంత్ సింగ్ రాజ్పుత్ను బాలీవుడ్ పెద్దలే హత్య చేశారని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఇండస్ట్రీలో నెపోటిజం ఉందని.. ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా హీరోలుగా అరంగేట్రం చేసిన వాళ్లను ఎదగనివ్వరని తేల్చి చెప్పింది. అయితే ఊహించని విధంగా కంగనా ఇంటి సమీపంలో కాల్పులు జరిగాయట.

ఈ విషయం పై కంగనా పోలీసులకు కంప్లైంట్ చేసింది. “శుక్రవారం రాత్రి నా ఇంటి సమీపంలో గన్ ఫైర్ చేసిన శబ్దం వినిపించింది. ఆ సమయంలో నాకు వెంటనే ప్రాణభయం ఏర్పడిందని కంప్లైంటులో తెలిపిందట. ఆ వెంటనే కులూ జిల్లా పోలీసులు ప్రాంతంలో తనిఖీలు సోదాలు నిర్వహించిన అనంతరం కొంతమంది సిబ్బందిని సెక్యూరిటీగా నియమించారు. ఆమె మాట్లాడుతూ.. “శుక్రవారం రాత్రి 11:30 గంటల టైంలో నేను బెడ్రూంలో ఉన్నాను. మా ఇంటికి గోడకు దగ్గరలో యాపిల్ చెట్లు చెరువు ఉన్నాయి. ఆ ప్రాంతం నుంచి బాంబులు పేలినట్టు భారీగా శబ్దం వినిపించింది. మొదట టపాసులే అనుకున్నా.. కానీ రెండోసారి గన్ పేలిన సౌండ్ వినిపించింది. అప్పుడే నా సెక్యూరిటీ పిలిచి అప్రమత్తం చేశాను.

అయితే యాపిల్ తోటలో గబ్బిలాలను చంపేందుకు ఎవరైనా రైతులు సౌండ్ చేశారేమో అని సెక్యూరిటీ తెలిపారు. కానీ మా ఇంట్లో అందరూ అది గన్ సౌండే అన్నారు. సెకండ్స్ లోనే రెండుసార్లు ఫైర్ అయింది. అయితే బాలీవుడ్ వారు ఎవరైనా నాపై పన్నాగం పన్నారేమో అనిపిస్తుంది. ఇక్కడ ఆల్రెడీ మనుషులను సెట్ చేసి ఉంటారు. ముందే ఏడెమిది వేలకు చంపేవారు కూడా ఈ ప్రాంతంలో ఉంటారని” తెలిపింది. ఇక కంగనా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర సీఎం కొడుకుతో కూడా మాట్లాడిందట. ఆయనకు జరిగిన విషయం చెప్పి పోలీసులను అప్రమత్తం చేసిందట. వారు స్థానిక వాహనాలను అపరిచితులను పరిశీలిస్తూ విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరి నిజంగా ఇది ఎవరిదైనా ప్లానా.. లేక తోటలో గబ్బిలాల కోసం పేల్చరా..? అనేది తెలియాల్సి ఉంది.