`హిరణ్య కశిప`కు గుణశేఖర్ జేగంట!

0

రానా దగ్గబాటితో గుణశేఖర్ హిరణ్య కశిప చిత్రాన్ని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. భారీ విజువల్ గ్రాఫిక్స్ నేపథ్యంలో అత్యంత భారీ బడ్జెట్ తో డి.సురేష్ బాబు-గుణశేఖర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇక రుద్రమదేవి రిలీజ్ అనంతరం గుణశేఖర్ పూర్తిగా ఈ ప్రాజెక్ట్ పనుల్లోనే బిజీగా ఉన్నాడు. దాదాపు మూడేళ్ల నుంచి దీనిపైనే వర్క్ చేస్తున్నాడు. ఏడాది కాలం పాటు లండన్-హైదరాబాద్ లలో పలు టెక్నికల్ టీమ్ లతో గుణశేఖర్ వర్క్ షాప్స్ చేశారు. రుద్రమదేవికి పనిచేసిన టెక్నికల్ టీమ్ లో కొంత మంది గుణతో పాటు ట్రావెల్ అవుతున్నారు. తాజాగా గుణ శేఖర్ ఇచ్చిన హింట్ ప్రకారం సినిమాకు స్క్రిప్ట్ కు సంబంధించి పనులు దాదాపు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది.

ఈ చిత్రానికి సహాయ దర్శకులుగా తెలుగు భాష సాహిత్యంపై పట్టున్న వారు కావలెను అని ట్విటర్ వేదికగా ప్రకటన ఇచ్చారు. అందులో సినిమా టైటిల్ వెల్లడించలేదు గానీ.. ప్రస్తుతం ఆయన ప్రాజెక్ట్ `హిరణ్య కశిప` కాబట్టి దానికి సంబంధించిన టీమ్ నే రిక్రూట్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనిని బట్టి ఈ భారీ పాన్ ఇండియా చిత్రం అతి త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారీ కాన్వాసుపై తెరకెక్కనున్న చిత్రం కావడంతో పెద్ద ఎత్తున కొత్త టీమ్ ను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గుణ శేఖర్ దగ్గర టెక్నికల్-నాన్ టెక్నికల్ స్టాప్ కొంత మంది ఉన్నారు. రుద్రమదేవి కి పనిచేసిన విదేశీ టెక్నిషీయన్లు ఆయనతో ట్రావెల్ అవుతున్నారు.

వాళ్లందిరితో పాటే ఈ కొత్త వాళ్లను జాయింట్ చేయనున్నట్లు తెలుస్తోంది. తెలుగు భాషపై పట్టున్న వారందరినీ ఓ టీమ్ గా ఏర్పాటు చేసి స్క్రిప్ట్ కు సంబంధించిన పనుల్లో భాగస్వామ్యం చేసే అవకాశం ఉంది. హిరణ్య కశిపలో పౌరాణిక నేపథ్యం కూడా మిక్స్ అవుతుంది కాబట్టి భాషపై అపారం జ్ఞానం.. అనుభవం అవసరం. అలాంటి వారికి హిరణ్య కశిప ఛాన్స్ మంచి వేదిక అవుతుంది. మరి ఈ అవకాశాన్ని ఎంతమంది సద్వినియోగంచేసుకుంటారో చూడాలి.
Please Read Disclaimer