అనుష్క మగవేషం దాచేస్తే దాగునా?

0

అనుష్క టైటిల్ పాత్రలో గుణశేఖర్ తెరకెక్కించిన `రుద్రమదేవి` 2015 అక్టోబర్ లో రిలీజైన సంగతి తెలిసిందే. ఎన్నో ఆర్థిక కష్టాల నడుమ ఈ చిత్రాన్ని దర్శకనిర్మాత గుణశేఖర్ రిలీజ్ చేశారు. అందుకు అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో చేసిన సాయానికి ప్రశంసలు దక్కాయి. ఆ సినిమాకి తెలంగాణలో పన్ను మినహాయింపును కూడా ఇచ్చారు. వివాదాలు.. రకరకాల కష్టాల నడుమ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మెజారిటీ పార్ట్ రికవరీ చేసిందన్న టాక్ అప్పట్లో వినిపించింది.

ఇకపోతే ఆ సినిమాని 3డిలో రిలీజ్ చేసేందుకు గుణశేఖర్ సన్నాహాలు చేస్తున్నారట. వారియర్ క్వీన్ రుద్రమదేవిని 3డి వెర్షన్ లో చూస్తే ఎగ్జయిట్ అవుతారని చెబుతున్నారు. ఈ ప్రయత్నంపై తాజాగా గుణశేఖర్ కాంపౌండ్ నుంచి కొంత సమాచారం లీకైంది. అకడమిక్స్ లో చరిత్ర పాఠాలు చదువుకున్న వారికి రుద్రమదేవి కథాంశం కొత్తేమీ కాదు. కాకతీయ సామ్రాజ్యాన్ని కాపాడేందుకు రుద్రమదేవి విరోచిత పోరాటాలు.. సాహసాలు.. వీటన్నిటినీ మించి మగాడి వేషంలోనే సామంత రాజులకు పరిచయం అవ్వడం వగైరా సన్నివేశాలు ప్రేక్షకులు అంత తేలిగ్గా మర్చిపోలేరు.

ఇక ఇందులో క్వీన్ రుద్రమ మగ వేషాన్ని 3డి రిలీజ్ ప్రమోషన్స్ లో రివీల్ చేయకుండా సీక్రెట్ గా ఉంచనున్నారట. ప్రచార వీడియోల్లో ఎక్కడా ఆ గెటప్ ని రివీల్ చేయరని తెలుస్తోంది. అలా చేస్తే `రుద్రమదేవి 3డి` చూసే ప్రేక్షకులకు థ్రిల్ కలుగుతుందని గుణశేఖర్ నమ్మకంగా ఉన్నారట. అయితే ఇప్పటికే ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులు మెజారిటీ పార్ట్ చూసి ఉన్నారు. అందువల్ల ఇప్పటివరకూ చూడని వాళ్లకు మాత్రమే ఆ థ్రిల్ కలుగుతుంది. ఒకవేళ ఇరుగు పొరుగు భాషల్లో ఈ 3డి వెర్షన్ ని రిలీజ్ చేస్తే గనుక అక్కడ సర్ ప్రైజ్ ట్రీట్ ఇస్తుందనడంలో సందేహమేం లేదు. రుద్రమదేవి కథలో సాహసాలు.. పోరాటాల్ని మించిన ఎన్నో రహస్యాలు .. ఎమోషన్స్ హైలైట్. వాటిని గుణశేఖర్ చక్కగా ఎలివేట్ చేశారు. మరి 3డి వెర్షన్ రిజల్ట్ ఎలా ఉండనుందో వేచి చూడాలి.
Please Read Disclaimer