ఆ మూవీ కోసమే గుండు గెటప్!

0

ఒక అగ్ర హీరో బట్టతలతో కనిపించడం అన్నదే సాహసం. కానీ ఆ సాహసానికి ఏమాత్రం భేషజం చూపించలేదు మెగాస్టార్ చిరంజీవి. మాస్ లో వీరలెవల్లో ఫ్యాన్స్ ఉన్న చిరంజీవి మునుపెన్నడూ కనిపించని సరికొత్త గెటప్ లో కనిపించనుండడం ఇటీవల హాట్ టాపిక్ గా మారింది. ఆయన గుండుతో లేదా బట్టతలతో కనిపించే సాహసం చేస్తుండడం ఆసక్తికరం.

మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా ఖాతాలో తన క్లీన్-షేవెన్ హెడ్ ఫోటోను పోస్ట్ చేసినప్పుడు అభిమానులకు కలిగిన సందేహం ఇది ఏ సినిమా కోసం? అనేదే. ఆ వెరైటీ రూపానికి ‘అర్బన్ సన్యాసి’ అని క్యాప్షన్ ఇచ్చారు. కొద్ది రోజుల క్రితం ఆ స్పెషల్ గెటప్ వెనుక ఉన్న రహస్యాన్ని ఓ వీడియో ద్వారా రివీల్ చేశారు చిరు. తనే స్వయంగా సోషల్ మీడియాల్లో దానిని పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది.

అసలింతకీ ఈ కొత్త అవతారం దేనికి? అంటే.. తదుపరి తాను చేయబోయే సినిమాలో గెటప్ కి సంబంధించిన ట్రయల్ షూట్ లో భాగమని త్వరలో ప్రారంభించే `వేదాళం` రీమేక్ లో తన పాత్ర కోసమే ఈ రూపానికి షిఫ్టయ్యానని చిరు చెప్పారు. ఆ లుక్ కి పాజిటివ్ స్పందన వచ్చింది. వేదాళం సెకండాఫ్ లో ఈ గెటప్ ఉందని చిరుకి తెలియదట. పైగా ఈ గెటప్ ని శంకర్ సూపర్ హిట్ మూవీ `శివాజీ`లో రజనీకాంత్ ఇప్పటికే ట్రై చేశారు. అది పెద్ద సక్సెసైంది కూడా. ఇటీవల ఆ లుక్ ఇదే అంటూ ప్రచారం సాగడంతో చిరు టీమ్ కి అది నచ్చలేదన్న గుసగుసలు వినిపించాయి.

లేటెస్ట్ క్రేజీ రీమేక్ లో చిరు ఒరిజినల్ రూపం ఏది? అన్నది ఇంకా సస్పెన్స్ లో ఉంచారట. షూటింగ్ ప్రారంభమయ్యాక.. వేరొక లుక్ కూడా రిలీజయ్యే ఛాన్సుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. వేదాళం తెలుగు రీమేక్ కు మెహర్ రమేష్ దర్శకత్వం వహించనున్నట్లు చిరు అధికారికంగా ధృవీకరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ పూర్తవుతోంది. ప్రీప్రొడక్షన్ పనులు చేస్తున్నారని సమాచారం.