ఆకాశం ఎత్తుకు ఎదిగిన ధీరవనిత కథ

0

అతిలోక సుందరి శ్రీదేవి నటవారసురాలిగా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ ఊపిరి సలపనంత బిజీ షెడ్యూల్స్ తో క్షణం తీరిక లేకుండా ఉంది. ధడక్ తర్వాత `గుంజన్ సక్సెనా: ది కార్గిల్ గర్ల్` అనే చిత్రంలో నటిస్తోంది. ఇందులో సాహసాల పైలెట్ గుంజన్ సక్సేనా పాత్రలో జాన్వీ నటిస్తోంది. కార్గిల్ యుద్ధంలో వైమానిక దాడుల్లో పాల్గొన్న తొలి భారతీయ మహిళా పైలెట్ గా గుంజన్ సంచలనం సృష్టించారు. రణభూమిలో విరోచిత పోరాటానికి సిద్ధమైన మహిళగా జననీరాజనాలు అందుకున్న ధీరవనిత గుంజన్ ఎందరికో స్ఫూర్తి. అందుకే ఆ పాత్రలో జాన్వీ నటిస్తోంది అనగానే అందరిలో ఒకటే ఉత్కంఠ పెరిగింది.

అసలు ఈ చిత్రంలో జాన్వీ ఎలా కనిపించబోతోంది? అనేందుకు ఇదిగో ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లు చూస్తే అర్థమైపోతోంది. ధర్మ మూవీస్ ట్విట్టర్ లో ఈ పోస్టర్లు రిలీజయ్యాయి. జాన్వీ వైమానిక దళంలో పైలెట్ గాళ్ లుక్ అభిమానుల్లోకి దూసుకెళుతోంది. పురుషాధిక్య ప్రపంచంగా చెప్పుకునే వైమానిక దళంలో ధీరవనితగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మహిళ కథలో జాన్వీ నటించడం ఆసక్తికరం. ఆకాశంలో సగం కాదు.. ఆకాశం ఎత్తుకు ఎగిరిన మహిళ కథ ఇది.. అంటూ ఎమోషనల్ ట్వీట్లు కనిపించాయి. 13 మార్చి 2020న ఈ సినిమా రిలీజ్ కానుంది.

అలాగే జాన్వీ ఈ సినిమాతో పాటు `రూహి అబ్జా` అనే మరో క్రేజీ చిత్రంలోనూ నటిస్తోంది. రాజ్ కుమార్ రావు- పంకజ్ త్రిపాఠి కాంబినేషన్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అలాగే కరణ్ జోహార్ హిస్టారికల్ మల్టీస్టారర్ తక్త్` లోనూ నటిస్తోంది. రణవీర్ – విక్కీ కౌశల్ మధ్య సింహాసనం కోసం పోరాటం నేపథ్యంలో ఆసక్తికర డ్రామాతో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో ఆ ఇద్దరికీ సోదరి పాత్రలో కరీనా కపూర్ నటిస్తోంది. ఫిబ్రవరి 2020లో `తక్త్` రిలీజ్ కానుంది.
Please Read Disclaimer