భీష్ముడి దుంపతెంచే కుమారి..?

0

హెబ్బా పటేల్ పేరు తెలియని ఈ తరం తెలుగు ప్రేక్షకులుఎవరూ ఉండరు. అయితే ఎంత వేగంగా బోల్డ్ టాగ్ తెచ్చుకుని యూత్ లో క్రేజీ హీరోయిన్ గా.. ‘కుమారి’ గా మారిందో అంత వేగంగా కెరీర్ డౌన్ అయింది. వరస ఫ్లాపులతో హెబ్బా ఫేడ్ అవుట్ అయ్యే దశకు వచ్చిందని కూడా టాక్ వినిపించింది. అయితే హెబ్బా ను అభిమానించేవారికి ఇదో థ్రిల్లింగ్ అప్డేట్.

హెబ్బా ఇప్పటివరకూ చేసినవన్నీ బోల్డ్ పాత్రలే.. అయితే మొదటిసారి నెగెటివ్ టచ్ ఉండే పాత్రలో నటించేందుకు హెబ్బా అంగీకరించిందని టాక్ వినిపిస్తోంది. హీరో నితిన్ ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నితిన్ కు జోడీగా రష్మిక మందన్న నటిస్తోంది. ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం హెబ్బాను సంప్రదించారని… హెబ్బా కూడా ఈ క్రేజీ ఆఫర్ కు ఓకె చెప్పిందని అంటున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కంటే విలన్ పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఉండడంతో హెబ్బా ఎక్కువ ఆలోచించకుండా యాక్సెప్ట్ చేసిందని టాక్.

‘ఛలో’ తర్వాత దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై పాజిటివ్ బజ్ ఉంది. పైగా నితిన్ – రష్మిక జోడీ కూడా సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఒకవేళ ఈ హెబ్బా విలన్ రోల్ కూడా నిజమే అయితే ఈ సినిమా ఒక క్రేజీ ప్రాజెక్టుగా మారుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home