ఆమె బుగ్గ కందేలా కుర్ర హీరో చుమ్మా

0

అందాల ముద్దుగుమ్మ హన్సిక పాల బుగ్గపై మరీ అంత ఘాటైన చుమ్మా ఇచ్చేస్తున్నాడు సందీప్. మొహమాట పడక మరీ అలా డీప్ కిస్ కొట్టేస్తున్నాడంటే అదేదో రొమాంటిక్ మూవ్ మెంట్ అని అర్థమవుతోంది. ఇంతకీ ఇది ఏ సినిమాలో సన్నివేశం అంటారా?

తెనాలి రామకృష్ణ బీఏబీఎల్.. సందీప్ – హన్సిక జంటగా నటిస్తున్న కామెడీ ఎంటర్ టైనర్ ఇది. ఈ చిత్రంలో సందీప్ – హన్సిక ఇద్దరూ యంగ్ లాయర్లుగా నటిస్తున్నారు. ఆ ఇద్దరి మధ్యా కడుపుబ్బా నవ్వించే సన్నివేశాలు కోకొల్లలుగా ఉంటాయట. కేవలం ఫన్ మాత్రమే కాదు.. ఇద్దరి మధ్యా రొమాన్స్ ఏ రేంజులో వర్కవుట్ అయ్యిందో ఇదిగో ఈ ఫోటో చూస్తేనే అర్థమవుతోంది. హనీ బుగ్గ కందేలా సందీప్ కిషన్ ఘాటైన చుమ్మా ఇచ్చేస్తున్నాడు. పైగా ఆ ఇద్దరి మెడలో పూల దండలు చూస్తుంటే .. నిశ్చితార్థమో లేదా పెళ్లి జరిగిందో అర్థం కావడం లేదు. లాయర్ లా పాయింట్ లాగే మరో లాయర్ ని పెళ్లాడితే అంతేగా..! ఇప్పటికే టీజర్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. సందీప్ కెరీర్ లో మరో క్లాసిక్ కామెడీ చిత్రంలో నటిస్తున్నాడని అర్థమవుతోంది.

గత కొంతకాలంగా సరైన హిట్టు పడక సందీప్ డైలమాలో ఉన్నాడు. నీవు లేక నేను లేను అనే చిత్రానికి ప్రశంసలు దక్కినా ఆశించినంత బ్లాక్ బస్టర్ అందుకోలేకపోయాడు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ అంత ఊపు తెచ్చే సినిమా పడలేదు. అందుకే ఈసారి అతడు కెరీర్ పరంగా మరింత శ్రద్ధ తీసుకుంటున్నాడట. తెనాలి రామకృష్ణ.. ఆ కోరికను తీరుస్తుందనే ఆశిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఫేడవుట్ అయిపోయిన హన్సికకు ఈ సినిమా చాలా ఇంపార్టెంట్. అయితే యువలాయర్లు ఏ స్థాయిలో రాణించారు? అన్నది తెలియాలంటే కాస్త రిలీజ్ వరకూ ఆగాల్సిందే. జి.నాగేశ్వర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెలలోనే సినిమా రిలీజ్ కానుంది.
Please Read Disclaimer