దేశముదురు పాప కెరీర్ క్లోజేనా?

0

హన్సిక మోత్వాని తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు ఉన్న భామే. అప్పుడెప్పుడో 2007 లో అల్లు అర్జున్ – పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో తెరకెక్కిన సూపర్ హిట్ ఫిలిం ‘దేశముదురు’ సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత పెద్ద హీరోలతో చాలా సినిమాలు చేసింది. తెలుగులో కెరీర్ కాస్త స్లో అయ్యే సమయానికి కోలీవుడ్ కు మకాం మార్చింది. అక్కడ బిజీగానే ఉంది. అయితే చాలా కాలం తర్వాత సందీప్ కిషన్ సినిమా ‘తెనాలి రామకృష్ణ BA BL’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.

ఈ సినిమా ఫలితం సంగతి పక్కన పెడితే హన్సిక లుక్స్ కు మాత్రం నెగెటివ్ మార్కులు పడ్డాయి. హన్సికలో మునుపటి గ్లామర్ లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. హన్సిక మొదటి నుంచి గ్లామరస్ హీరోయిన్ గానే పేరు తెచ్చుకుంది కానీ ఎప్పుడూ నటన విషయంలో ప్రేక్షకులను థ్రిల్ చేసిన సందర్భం లేదు. ఇప్పుడు గ్లామర్ విషయంలోనే మార్కులు తగ్గాయి కాబట్టి ఇకపై తెలుగులో అవకాశాలు రావడం కష్టమేనని టాక్ వినిపిస్తోంది. కనీసం ‘తెనాలి రామకృష్ణ BA BL’ సినిమా అయినా సూపర్ హిట్ అయితే ఎవరైనా హన్సిక పేరును పరిశీలించేవారేమో కానీ అలా జరగడం అంత సులువు కాదని అంటున్నారు. ఈలెక్కన టాలీవుడ్ లో హన్సిక కు అన్ని దార్లు మూసుకుపోయినట్టే.

అయితే కోలీవుడ్ లో మాత్రం ఇంకా నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిలో పెద్ద హీరోల సినిమాలయితే ఒక్కటి కూడా లేదు. అన్నీ కొత్త దర్శకులు… లేడీ ఓరియంటెడ్ టైపు సినిమాలే. అంటే కోలీవుడ్లో కూడా హన్సిక పరిస్థితి చివరి దశకు వచ్చినట్టే.
Please Read Disclaimer