దేశముదురు బ్యూటీ హన్సిక క్రికెటర్ తో సెట్

0

తెలుగు ప్రేక్షకులకు ‘దేశముదురు’ చిత్రంతో పరిచయం అయిన ముద్దుగుమ్మ హన్సిక గత పుష్కర కాలంకు పైగా తెలుగు.. తమిళ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూనే ఉన్న విషయం తెల్సిందే. ఈమద్య కాలంలో ఈమెకు స్టార్ హీరోల సరసన అవకాశాలు కాస్త తగ్గాయి. దాంతో ఈమె హర్రర్ చిత్రాలు.. లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు కమిట్ అవుతుంది. తాజాగా ఈమె మరో హర్రర్ కామెడీ సినిమాకు ఓకే చెప్పింది. అతి త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతుంది.

‘అంబులి’ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకద్వయం హరి శంకర్ మరియు హరీష్ నారాయణలు రంగనాధ్ దర్శకత్వంలో ఒక హర్రర్ కామెడీ సినిమాను చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే హన్సిక ఓకే చెప్పగా ఇటీవలే ఈ దర్శకద్వయం మాజీ క్రికెటర్ శ్రీశాంత్ ను కలిసి కథ నరేట్ చేయడం జరిగిందట. ఆయన కూడా ఓకే అన్నట్లుగా సమాచారం అందుతోంది. తమిళంలో రూపొందబోతున్న ఈ చిత్రంను తెలుగు మరియు మలయాళంలో డబ్ చేయనున్నారు.

తమిళ సినీ ఇండస్ట్రీలో మొదటి 3డి స్ట్రీరియోస్కోపిక్ సినిమాగా ‘అంబులి’ని తెరకెక్కించిన హరి శంకర్ మరియు హరీష్ నారాయణలు మరోసారి విభిన్నమైన నేపథ్యంతో హన్సిక మరియు శ్రీశాంత్ లతో సినిమాను చేసేందుకు సిద్దం అయ్యారు. అతి త్వరలోనే సినిమా పట్టాలెక్కబోతుంది. కథ చెప్పిన వెంటనే తన పాత్రకు హన్సిక ఫిదా అయ్యి వెంటనే నటించేందుకు ఓకే చెప్పిందని తమిళ మీడియా సంస్థ కథనంలో పేర్కొంది. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రంను వచ్చే ఏడాది వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.
Please Read Disclaimer