విజయ్ దేవరకొండతో శర్వా దర్శకుడు ?

0

గత ఏడాది డిసెంబర్ లో శర్వానంద్ సాయి పల్లవి జంటగా భారీ అంచనాల మధ్య విడుదలై వాటిని అందుకోలేకపోయిన పడి పడి లేచే మనసు దర్శకుడు హను రాఘవపూడి కొత్త సినిమాకు రంగం సిద్ధమైనట్టు టాక్. కమర్షియల్ రిజల్ట్ తో సంబంధం లేకుండా టేకింగ్ పరంగా మెప్పు పొందే హను ఈసారి ఏదీ మిస్ కాకుండా ఓ పవర్ ఫుల్ లవ్ స్టోరీ రాసుకున్నారని ఇన్ సైడ్ టాక్. విజయ్ దేవరకొండకు వినిపించడం అది నచ్చి త్వరలోనే ఏ విషయం చెబుతానని పాజిటివ్ గా రెస్పాండ్ అవ్వడం గురించి ఇప్పటికే న్యూస్ లీకైపోయింది.

అంతే కాదు విజయ్ దేవరకొండతో రెండు సినిమాలతో గతంలో అసోసియేట్ అయిన నిర్మాత స్వప్నా దత్ మహానటి తీసిన బ్యానర్ మీదే ఇది నిర్మించేందుకు ముందుకు వచ్చినట్టు వినికిడి. అయితే హీరో డేట్స్ చాలా టైట్ గా ఉన్న నేపధ్యంలో ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు రంగంలోకి దిగుతుందనేది వేచి చూడాలి. విజయ్ దేవరకొండ ప్రస్తుతం డియర్ కామ్రేడ్ విడుదల కోసం వెయిటింగ్ లో ఉన్నాడు. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది.

ఆనంద్ అన్నామలై ని టాలీవుడ్ కు పరిచయం చేస్తూ మొదలుపెట్టిన హీరో ఇటీవలే ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇవి కాకుండా మరో రెండు కథా చర్చల ఫైనల్ స్టేజి లో ఉన్నాయి. వీటి మధ్య హను రాఘవపూడి ఎక్కడ స్పేస్ దక్కించుకుంటాడు అనేది వేచి చూడాలి. ఇప్పుడీ లవ్ స్టోరీ మిలిటరీ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని వినికిడి. ఒకవేళ కార్యరూపం దాల్చితే హను నానితో తీసిన కృష్ణగాడి వీరప్రేమగాధ తరహాలో విజయ్ దేవరకొండ నుంచి మంచి లవ్ స్టోరీని ఆశించవచ్చు.