సుకుమార్ బర్త్ డే వీడియో బన్నీ ఫ్యాన్స్ కు పిచ్చెక్కిస్తోంది

0

అల్లు అర్జున్ మరికొన్ని గంటల్లో అల వైకుంఠపురంలో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉన్నాడు. బన్నీ ఫ్యాన్స్ ఇప్పటికే చాలా ఉత్కంఠతతో సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా సక్సెస్ గ్యారెంటీ అనే నమ్మకంతో వారంతా ఉన్నారు. ఇదే సమయంలో డబుల్ ధమాకా అన్నట్లుగా బన్నీ ఫ్యాన్స్ ను మైత్రి మూవీస్ వారు విడుదల చేసిన ఒక వీడియో ఫుల్ ఖుషీ చేస్తోంది. ఆ వీడియో చూడగానే బన్నీ కొత్త సినిమా ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ ఇప్పటి నుండే ఉవ్విల్లూరుతున్నారు.

నేడు సుకుమార్ పుట్టిన రోజు సందర్బంగా ఆయన అల్లు అర్జున్ తో తెరకెక్కిస్తున్న సినిమా మేకింగ్ వీడియోను ప్రొడక్షన్ హౌస్ విడుదల చేసింది. గత నెలలో కేరళలోని అందమైన లొకేషన్స్ లో బన్నీ మరియు ముఖ్యమైన నటీనటులపై కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. మొదటి నుండి కూడా ఈ చిత్రం ఫారెస్ట్ నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. అన్నట్లుగానే మేకింగ్ వీడియోలో అందమైన జలపాతాలు మరియు అడవి ప్రాంతంను చూపించడం జరిగింది.

సుకుమార్ బర్త్ డే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బన్నీ లుక్ ను రివీల్ చేయకున్నా కూడా ఆ అందమైన లొకేషన్స్ లో బన్నీ సినిమా తెరకెక్కబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అల వైకుంఠపురంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న అల్లు అర్జున్ కొన్ని రోజుల్లో సుకుమార్ తో జాయిన్ కాబోతున్నాడు.

వీరిద్దరి కాంబోలో ఇప్పటికే వచ్చిన ఆర్య మరియు ఆర్య 2 లు మంచి సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు ఈ సినిమాతో మరో సక్సెస్ ను వీరి కాంబో తమ ఖాతాలో వేసుకుంటుందనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు. రంగస్థలం తర్వాత గ్యాప్ తీసుకున్న సుకుమార్ మళ్లీ ఇప్పుడు బన్నీతో ఈ సినిమా చేస్తున్నాడు. రంగస్థలం స్థాయి సినిమాను సుకుమార్ చేస్తున్నాడంటూ చిత్ర యూనిట్ సభ్యులు అనధికారికంగా చెబుతున్నారు.
Please Read Disclaimer