హ్యాపీ బర్త్ డే టు లేడీ సూపర్ స్టార్

0

తమిళంలో ఒక వైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తూ మరో వైపు స్టార్ హీరోలతో కమర్షియల్ సినిమాలు చేస్తున్న ముద్దుగుమ్మ నయనతార. తమిళనాడులోనే కాకుండా సౌత్ ఇండియా మొత్తంలో ఈమె స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుంది. లేడీ సూపర్ స్టార్ అనే ట్యాగ్ తో నయనతార దూసుకు పోతుంది. ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్లు గడిచినా కూడా ఏమాత్రం క్రేజ్ తగ్గకుండా టాప్ స్టార్స్ కు మోస్ట్ వాంటెడ్ గా నటిస్తూ వస్తుంది.

ఇటీవలే తమిళ స్టార్ హీరో విజయ్ తో బిగిల్ లో నటించిన నయనతార ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ తో ‘దర్బార్’ చిత్రంలో నటిస్తోంది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం సైరాలో నటించిన విషయం తెల్సిందే. ఇలా సూపర్ స్టార్.. మెగాస్టార్స్ కు జోడీగా నటిస్తున్న నయనతార సౌత్ ఇండియా మోస్ట్ బిజీ హీరోయిన్ గా మరియు టాప్ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్ గా పేరు దక్కించుకుంది.

ఇక వ్యక్తిగత విషయానికి వస్తే ప్రస్తుతం నయన్ దర్శకుడు విఘ్నేష్ శివన్ తో లివింగ్ రిలేషన్ లో ఉంది. త్వరలోనే వీరిద్దరు ఏకం అవ్వబోతున్నారు. నిర్మాణ రంగంలో కూడా అడుగు పెట్టిన నయనతార తన ప్రియుడితో సినిమాలు చేస్తోంది.

వరుసగా సూపర్ హిట్స్ అందుకుంటూ లేడీ సూపర్ స్టార్ ట్యాగ్ ను సార్థకం చేసుకుంటున్న నయనతార బర్త్ డే నేడు. ఈ సందర్బంగా ఆమె అభిమానులు మరియు సినీ వర్గాల వారు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఈ సందర్బంగా మా తరపున కూడా నయనతారకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
Please Read Disclaimer