ఫస్ట్ లుక్: పవన్ అడుగుజాడల్లో సత్యాగ్రహి

0

‘సత్యాగ్రహి’ అనే టైటిల్ చూడగానే ఎవరికైనా వెంటనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గుర్తొస్తారు. గతంలో పవన్ కళ్యాణ్ ‘సత్యాగ్రహి’ అనే టైటిల్ తో సామాజిక అంశాల నేపథ్యంలో ఒక సినిమాకు శ్రీకారం చుట్టారు. స్వయంగా పవన్ ఆ సినిమాకు దర్శకత్వం వహించాలని అనుకున్నారు. అయితే సినిమా లాంచ్ అయిన తర్వాత కొన్ని రోజులకు ఆ సినిమా ఆగి పోయింది. ఇప్పుడు అదే టైటిల్ తో వేరే హీరోలతో ఒక కొత్త సినిమా ప్రేక్షకు ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది.

కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ భవిత క్రియేషన్స్ బ్యానర్ పై గంగారెడ్డి నిర్మిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్లో నలుగురు యువకులు చేతులు పైకెత్తి మేము సిద్ధం అన్నట్టుగా నిలుచున్నారు. నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పిడికిలి బిగించి ఉన్న పెయింటింగ్ మసకగా ఉంది. అంటే పవన్ కళ్యాణ్ ఆలోచనలు ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకుసాగే యువకుల కథ ఈ సినిమా అని మనం అనుకోవచ్చు. ఈ సినిమాకు టాగ్ లైన్ “ఇన్ స్పైర్డ్ బై ట్రూ లీడర్”.

ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయిందని సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు రిలీజ్ డేట్ ప్రకటిస్తారు. ఈ సినిమాకు సాయి కార్తీక్ సంగీత దర్శకుడు. కృష్ణ చైతన్య ఈ సినిమా కు కథ.. స్క్రీన్ ప్లే.. సంభాషణలు అందించడంతో పాటుగా దర్శకత్వం కూడా వహించారు.
Please Read Disclaimer