స్టార్ క్రికెటర్ కొత్త గర్ల్ ఫ్రెండ్ తో చక్కర్లు

0

టీం ఇండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య గతంలో డేటింగ్ లో ఉన్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. ఇతడు డేటింగ్ చేస్తున్న అమ్మాయిల సంఖ్య పెరిగి పోతూనే ఉంది. గతంలో బాలీవుడ్ ముద్దుగుమ్మలు ఊర్వశి రౌటేలా.. ఎల్లీ అవ్రవ్.. ఇషా గుప్తాలతో ఇతడు డేటింగ్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. వారితో కలిసి తిరిగిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేశాయి. ఇప్పుడు కొత్త గర్ల్ ఫ్రెండ్ ను హార్ధిక్ ఎంచుకున్నట్లుగా సమాచారం అందుతోంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం నాచ్ బలియా సీజన్ 9లో డీజేవాలె బాబు సాంగ్ తో చాలా ఫేమస్ అయిన ముద్దుగుమ్మ నటాషా స్టాన్ కోవిచ్ తో మనోడు డేటింగ్ లో ఉన్నాడట. ప్రస్తుతం నటాషా బాలీవుడ్ లో బిజీ ఆర్టిస్టుగా.. డాన్సర్ గా ఉంది. ఆమె బాలీవుడ్ లో చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. హీరోయిన్ గా కూడా ఈమెకు అవకాశాలు వస్తున్నాయి. ఈ సమయంలోనే హార్ధిక్ పాండ్యాతో ఈమె డేటింగ్ విషయం బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది.

తాజాగా ముంబయిలో జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో హార్ధిక్ పాండ్య తన కుటుంబ సభ్యులకు నటాషాను పరిచయం చేశాడంట. సెర్బియాకు చెందిన నటాషా ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ సెలబ్రెటీగా మారిపోయింది. ఇక హార్ధిక్ పాండ్యాతో డేటింగ్ తో ఆమె క్రేజ్ ఇంకా పెరిగింది. గతంలో మాదిరిగా హార్ధిక్ ఈమెతో కేవలం కొన్ని రోజుల డేటింగ్ వరకేనా.. కలిసి జీవితం పంచుకునే వరకు వీరి రిలేషన్ షిప్ వెళ్తుందా అనేది కాలమే నిర్ణయించాలి.