అందుకే హార్దిక్ అవుట్..!

0

భారత క్రికెట్ జట్టులో ఆల్ రౌండర్ ఆటగాడు హార్దిక్ పాండ్యాకు జనవరి 1 న తన ప్రియురాలు నటాషా స్టాన్ కోవిచ్ తో ఎంగేజ్మెంట్ అయిన సంగతి తెలిసిందే. న్యూ ఇయర్ డే నాడు దుబాయిలో స్పీడ్ బోట్ లో విహరిస్తూ గర్ల్ ఫ్రెండ్ కు రింగ్ తొడుగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ జంట వెకేషన్ తర్వాత దుబాయి నుంచి తిరిగి వచ్చేసింది.

ఇక ఆ హంగామా అయిపోయింది అనుకునే లోపు నటాషా తన ఇన్స్టా ఖాతా ద్వారా కత్తి లాంటి బికినీ పిక్స్ పోస్ట్ చేసింది. సింగిల్ పీస్ స్విమ్మింగ్ డ్రెస్ కాబట్టి మొనోకిని అని పిలవాలి లెండి. హాట్ నెస్ ముఖ్యం కానీ బికినీ అయితేనేం.. మోనోకిని అయితేనేం. ఈ ఫోటోలకు క్యాప్షన్ ఏదీ ఇవ్వలేదు కానీ ఒక లవ్ ఏమోజి.. మరో లవ్ స్ట్రక్ ఎమోజిని జోడించింది. ఇక ఫోటోలలో ఉన్న మోనోకిని సూపర్ మోడరన్ గా ఉంది. సగం పులి చారల డిజైన్.. సగం నలుపు రంగు డిజైన్.. ఒక మహా వీ నెక్కు. అసలే అంతర్జాతీయ భామ. అందాలను ధారపోస్తూ భలే భలే పోజులిచ్చింది. అయినా లోకల్ ఇండియా భామలే హాటుగా ఘాటుగా ఉన్నారు. ఈమె సెర్బియా భామ.. ఆమాత్రం ఉండకపోతే ఎలా?

ఈ ఫోటోలకు సూపర్ కామెంట్లు వచ్చాయి. “హార్దిక్ ఔట్ హోగయా”.. “ఆయనగారు ఆల్ రౌండర్.. నువ్వు ఫోర్త్ అంపైర్” అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్లు పెట్టారు. ఒకరేమో “భయ్యాకో అచ్చా దేఖ్ భాల్ కర్నా భాభీ”అంటూ రిక్వెస్ట్ పెట్టుకున్నారు.
Please Read Disclaimer