సెర్బియా నటితో నిశ్చితార్థం.. పేరెంట్స్ కు హార్ధిక్ పాండ్యా షాక్

0

టీమిండియా దూకుడైన క్రికెటర్ హార్ధిక్ పాండ్యా అందరికీ షాక్ ఇచ్చాడు. ఆయన తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయం తెలిసి హార్ధిక్ తల్లిదండ్రులు షాక్ అయ్యారు. మా వాడు మాకే చెప్పలేదంటూ హార్ధిక్ తండ్రి వాపోయడం విశేషం.

సెర్బియా నటి స్టాన్ కవిచ్ తో టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా దుబాయ్ లో కలుసుకొని నిశ్చిత్తార్థం చేసుకున్నాడు. ఉంగరాలు మార్చుకున్నాడు. కొడుకు హార్ధిక్ నిశ్చితార్థం చేసుకున్న విషయం పాండ్యా తల్లిదండ్రులకు కూడా తెలియదు. దీంతో వారంతా షాక్ అయ్యారని తెలిసింది.

పాండ్యా నిశ్చితార్థంపై పాండ్యా తండ్రి హిమాన్షు పాండ్యా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పాండ్యా – నటాషా నిశ్చిత్తార్థం చేసుకుంటారని తమకు తెలియదని.. వారిద్దరూ ప్రేమలో ఉన్నారనే విషయం తెలుసునని అన్నారు. న్యూ ఇయర్ వేడుకలకు దుబాయ్ వెళ్తున్నట్టు మాత్రమే తమకు సమాచారం ఇచ్చారని ఆయన చెప్పారు. త్వరలోనే వారిద్దరికి ముహూర్తం పెడుతామని అన్నారు.
Please Read Disclaimer