ముద్దుల్లో రష్మికలా లిమిట్స్ దాటనంటోంది

0

తెలుగులో పలు సినిమాల్లో నటించినా కూడా పెద్దగా గుర్తింపు దక్కించుకోలేక పోయిన ముద్దుగుమ్మ హరిప్రియ. హీరోయిన్ గా ఈమె చేసిన సినిమాలేవి కూడా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేదు. దాంతో తెలుగు సినిమా పరిశ్రమలో ఈమెకు ఛాన్స్ లు రావడం లేదు. ఈ సమయంలోనే ఈమె కన్నడంలో బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఇటీవలే ఈమె కన్నడంలో ‘ఎల్లిడ్డే లిలీదంకా’ అనే చిత్రంలో సృజన్ లోకేష్ తో కలిసి నటించింది. ఈ చిత్రంలో సృజన్ మరియు హరిప్రియల మద్య ఒక లిప్ లాక్ సన్నివేశం ఉంది.

సినిమాకు ఆ లిప్ లాక్ తో మంచి క్రేజ్ దక్కింది. యూత్ ఆడియన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా ఎల్డిడ్డే లిలీదంకా చిత్రంపై పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. సోషల్ మీడియాలో సృజన్ మరియు హరిప్రియల లిప్ లాక్ ను ‘గీత గోవిందం’ చిత్రంలోని విజయ్ దేవరకొండ మరియు రష్మికల మద్దుతో పోల్చుతున్నారు. రష్మికలా హరిప్రియ కూడా లిప్ లాక్ లో జీవించింది అంటూ కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్న నేపథ్యంలో హరిప్రియ సీరియస్ అయ్యింది.

నా సినిమాను ఫ్యాన్స్ ఫ్యామిలీతో వచ్చి చూడాలనుకుంటాను. అందుకే రొమాంటిక్ సీన్స్ మరియు ముద్దు సీన్స్ విషయంలో నేను దూరంగా ఉంటు వచ్చాను. అయితే ఈ సినిమాలో మాత్రం హీరోతో కథానుసారంగా రొమాంటిక్ గా ఉండాల్సి వచ్చింది. అందుకే ముద్దు సీన్ చేశాను. కథకు అవసరం లేకున్నా నేను ముద్దు సీన్ చేయను. మరీ రష్మిక మందనా మాదిరిగా లిమిట్స్ దాటి మరీ ఘాడమైన ముద్దు సీన్స్ ను నేను ఎప్పుడు చేయనంటూ వ్యాఖ్యలు చేసింది. రొమాంటిక్ సీన్స్ విషయంలో నాకంటూ కొన్ని లిమిట్స్ ఉన్నాయి.. ఇతరుల మాదిరిగా వాటిని నేను క్రాస్ చేయనంటూ చెప్పుకొచ్చింది. హరిప్రియ కామెంట్స్ పై రష్మిక మందనా ఎలా రియాక్ట్ అవుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.Please Read Disclaimer