నేను కూడా పవర్ స్టార్ ఫ్యానే మర్చిపోకండి: స్టార్ డైరెక్టర్

0

షాక్ సినిమాతో డైరెక్టర్ గా మారి.. రవితేజ ‘మిరపకాయ్’తో మంచి హిట్ అందుకొని ఆ వెంటనే ‘గబ్బర్‌సింగ్’తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు హరీష్ శంకర్. ఆ తరువాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ గతేడాది ‘గద్దలకొండ గణేష్’ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు హరీష్. ఇక గడ్డలకొండ గణేష్ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు. హరీష్ శంకర్‌తో ఫస్ట్ కాంబినేషనే సూపర్ హిట్ కావడంతో ఆయనతో మరోసారి కలిసి పనిచేస్తామని నిర్మాతలు స్వయంగా ప్రకటించారు. ‘‘గద్దలకొండ గణేష్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించాం. ఇప్పుడు మరోసారి పవర్ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్ గారితో కలిసి ఓ క్రేజీ ప్రాజెక్ట్ కోసం పని చేయబోతున్నందుకు ఆనందంగా ఉంది. త్వరలోనే మరిన్ని వివరాలను తెలియజేస్తాం’’ అని రామ్ ఆచంట గోపి ఆచంట ప్రకటనలో తెలిపారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ తన 28వ సినిమా అంగీకరించిన విషయం తెలిసిందే.

దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. ఎనిమిది యేళ్ల తర్వాత మళ్లీ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దేవి శ్రీ ప్రసాద్ కలిసి వర్క్ చేయబోతున్నారు. ఈ సినిమా 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మించనుందని సమాచారం. ప్రస్తుతం హరీష్ శంకర్.. పవన్ సినిమా స్క్రిప్ట్‌తోనే బిజీగా ఉన్నారు. ఇక ట్విట్టర్లో ఓ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ హరీష్ ని ట్యాగ్ చేస్తూ.. “అన్న నువ్ ఎన్ని సినిమాలైనా చెయ్. కానీ నీ నెక్స్ట్ సినిమా మాత్రం పవర్ స్టార్ తోనే చేయాలి.. ఆ సినిమా రికార్డులు బద్దలుకొట్టాలి” అంటూ పోస్ట్ చేసాడు. ఇక ఫ్యాన్ పోస్ట్ కి స్పందించి హరీష్ శంకర్.. “తమ్ముడు.. పవర్ స్టార్ సినిమా స్క్రిప్ట్ వర్క్.. మ్యూజిక్ వర్క్ ప్రస్తుతం నడుస్తుంది. ఏదిఏమైనా నేను నెక్స్ట్ సినిమా ఓకే చేసేది మాత్రం పవర్ స్టార్ సినిమా తర్వాతే.. నేను కూడా మీలాంటి అభిమానినే అని మర్చిపోకు తమ్ముడు” అంటూ బదులు పోస్ట్ పెట్టడంతో ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ పోస్ట్ చూస్తే హరీష్ కి పవన్ పై ఎంత అభిమానం ఉందో అర్ధమవుతుంది. ఈసారి ట్రెండ్ సెట్ చేస్తాడో లేదో చూడాలి మరి!Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home