హరీష్ చేసేది రీమేక్ కాదు న్యూమేక్!

0

రీమేక్ సినిమాలు సేఫ్ బెట్ అని కొందరు హీరోలు నిర్మాతలు అనుకుంటారు. ప్రేక్షకుల్లో కొంతమందికి రీమేక్ లంటే చులకన అభిప్రాయం ఉంటుంది. ఆ.. అదేం గొప్ప కాదు. వేరే సినిమాలో హిట్ అయిన సినిమానే కదా అని చిన్నచూపు చూస్తారు. అయితే రీమేక్ సినిమాను ఒరిజినల్ కంటే బెటర్ గా తీర్చిదిద్దడంలో.. తనదైన శైలిలో దానికి తెలుగు నేటివిటీ టచ్ ఇవ్వడంతో డైరెక్టర్ హరీష్ శంకర్ స్పెషలిస్ట్. ఆ విషయం పవన్ కళ్యాణ్ తో తెరకెక్కించిన ‘గబ్బర్ సింగ్’ తోనే ప్రూవ్ అయింది. ఇప్పుడు ‘వాల్మీకి’ ప్రోమోస్ చూస్తుంటే అలాంటి ఫీట్ రిపీట్ చేశాడనే అంచనాలు వెలువడుతున్నాయి. నిన్న జరిగిన ‘వాల్మీకి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బ్రహ్మాజి ఈ విషయంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

స్పీచ్ ఇచ్చేందుకు బ్రహ్మాజీ స్టేజ్ మీదకు రావడంతోనే అరుపులు కేకలు మొదలయ్యాయి. హోస్ట్ గా వ్యవహరించిన సుమ బ్రహ్మాజీకి గుడ్ ఈవెనింగ్ చెప్తే.. బ్రహ్మాజీ స్పందిస్తూ “గుడ్ ఈవెనింగ్ అక్కా” అన్నాడు. అక్కా అనే పిలుపుకు షాక్ తిన్న సుమ “ఏవిటి.. అక్క. మీరెనేళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారో మాకు తెలుసు. మొత్తానికి హరీష్ శంకర్ గారు ఇన్నాళ్ళకు మీకు వయసుకు తగ్గ క్యారెక్టర్ ఇచ్చారు” అంటూ గట్టి పంచ్ వేసింది. బ్రహ్మాజీ దీనికి సమాధానంగా “ఎందుకులే ఆ టాపిక్ వద్దు” అంటూ టాపిక్ ను డైవర్ట్ చేశాడు. సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమాలో తనకు హరీష్ శంకర్ ఓ చిత్ర విచిత్రమైన క్యారెక్టర్ ఇచ్చాడని..గ్యాంగ్ స్టర్స్ కు యాక్టింగ్ నేర్పించే టీచర్ పాత్రలో నటించానని తెలిపాడు.

“ఈ సినిమా కథ మాత్రం హరీష్ శంకర్ తమిళం నుంచి తీసుకున్నాడు. కానీ చాలా మార్పులు చేర్పులు చేసి ఎంటర్ టైన్ మెంట్ జోడించాడు. జనరల్ గా ఒక భాషలో తీసిన సినిమాను మరో భాషలో తీస్తే దాన్ని రీమేక్ అంటారు. కానీ హరీష్ దాన్ని న్యూ మేక్ చేస్తాడు. ఒరిజినల్ ప్రొడ్యూసర్లే వచ్చి హరీష్ శంకర్ సినిమాను కొనుక్కునే పరిస్థితిని తీసుకొస్తాడు” అంటూ హరీష్ రీమేక్ లను డైరెక్ట్ చేసేవిధానం గురించి కొత్తగా చెప్పాడు.




Please Read Disclaimer