లేట్ అయినా లేటెస్టుగా రావాలని డిసైడైన హరీష్ శంకర్..!

0

మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ సెట్స్ పై ఉన్నప్పుడే ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని – రవి శంకర్ నిర్మించనున్న ఈ చిత్రాన్ని PSPK28 పేరిట అనౌన్స్ చేశారు. పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబోలో గతంలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సినిమా బ్లాక్ బస్టర్ అందుకోవడంతో ఈ ప్రాజెక్ట్ పై అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. ‘వకీల్ సాబ్’ కంప్లీట్ అయిన వెంటనే క్రిష్ మూవీ – హరీష్ శంకర్ సినిమాలను ప్యారలల్ గా చేస్తాడని అనుకున్నారు. అయితే పవన్ మాత్రం ఈ లాక్ డౌన్ టైంలో మరో మూడు సినిమాలకు కమిట్ అయ్యాడు. అంతేకాకుండా ఈ మధ్య ఓకే చేసిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ ని ముందుగా సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహకాలు చేస్తున్నారు. దీంతో హరీష్ తో సినిమా కోరుకుంటున్న అభిమానాలు అసహనానికి గురవుతున్నారని తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ బర్త్ డే నాడు హరీష్ శంకర్ రిలీజ్ చేసిన కాన్సెప్ట్ పోస్టర్ ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది. ఇండియా గేట్ బ్యాగ్రౌండ్ లో సర్ధార్ వల్లభాయ్ పటేల్ – సుభాష్ చంద్రబోస్ చిత్రాలు పాటు ఓ బైక్ పై పెద్ద బాలశిక్ష – గులాబీ పువ్వు కనిపించేలా డిజైన్ చేసిన పోస్టర్ ఈ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేసింది. ఈసారి ఎంటర్టైన్మెంట్ తో పాటు మంచి మెసేజ్ కూడా ఇవ్వనున్నారని వెల్లడించారు. అందుకే హరీష్ శంకర్ అందరి అంచనాలను ఏ మాత్రం తగ్గకుండా స్క్రిప్ట్ రెడీ చేయడానికి మరికొంత సమయం అడిగారట. ‘గబ్బర్‍ సింగ్‍’ తర్వాత వీరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో దానికి తగ్గట్టే స్టోరీ సిద్ధం చేస్తున్నాడట. అందుకే వీలైనంత సమయం తీసుకుని కంప్లీట్ కథతో రావాలని హరీష్ నిర్ణయించుకున్నాడట. ఇక ఈ సినిమాలో కూడా పవన్ గెటప్ – డైలాగ్స్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నాడని తెలుస్తోంది. పవన్ పొలిటికల్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని హరీష్ ఈ స్క్రిప్ట్ లో సామాజిక అంశాలను కూడా ప్రస్తావించనున్నారట. ఏదేమైనా మెగా ఫ్యాన్స్ మాత్రం మిగతా సినిమాల కంటే పవన్ – హరీష్ కాంబో కోసమే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని తెలుస్తోంది.