ఈ వాల్మీకి సుందరి ఎవరో కనిపెట్టారా?

0

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే దర్శకుడు హరీష్ శంకర్ ట్విట్టర్ లో ఓ ఫోటో షేర్ చేస్తూ పజిల్ పెట్టారు. వెనుక నుంచి హీరోయిన్ స్టిల్ ఇవ్వగా ఎవరో కనుక్కోండి చూద్దాం అనే తరహాలో పక్కన హరీష్ శంకర్ వేలు చూపిస్తూ ప్రశ్న అడగటంతో ఇది వైరల్ అయ్యింది. ఇప్పుడు సెట్స్ లో ఉన్న సినిమా వరుణ్ తేజ్ వాల్మీకినే కాబట్టి అధిక శాతం హీరోయిన్ పూజా హెగ్డే అని కరెక్ట్ గానే గెస్ చేశారు. ఇంకొందరు ఏవేవో పేర్లు చెప్పారు కానీ ఈ కన్ఫ్యూజన్ కు చెక్ పెడుతూ స్వయంగా పూజానే క్లారిటీ ఇచ్చేసింది.

అక్కడున్నది తానేనని చెప్పేసింది. దీంతో ఈ ప్రహసనానికి చెక్ పడిపోయింది. నెగటివ్ టచ్ ఉన్న రోల్ లో విభిన్న పాత్ర చేస్తున్న వరుణ్ తేజ్ పక్కన జోడిగా పూజా కనిపిస్తుందని టాక్ ఉంది. కాకపోతే సినిమా మొత్తం కాకుండా కీలకమైన భాగంలోనే పూజా రోల్ ఉంటుందని సమాచారం. దర్శకుడు హరీష్ శంకర్ అంటే పూజాకు ప్రత్యేకమైన అభిమానం. ముకుందా-ఒక లైలా కోసం ఫలితాలతో టాలీవుడ్ లో ఉనికి కష్టమైన పరిస్థితిలో డీజేతో పెద్ద బ్రేక్ ఇచ్చాడు.

అదీ గొప్ప విజయం సాధించకపోయినా బికినీలో పూజా చేసిన అల్లరి ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్లకు విపరీతంగా నచ్చేసింది. ఫలితంగా పోటీ పడి మరీ తమ సినిమాల్లో ఆఫర్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఫ్లాప్ ముద్రను అరవింద సమేత వీర రాఘవ-మహర్షి పోగొట్టేశాయి కాబట్టి ఇప్పుడు లక్కీ అనే స్టాంప్ కూడా పడిపోయింది. ప్రస్తుతం అల్లు అర్జున్-ప్రభాస్ సినిమాలు చేస్తున్న పూజా హెగ్డే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లో టాప్ రేంజ్ లో ఉంది. ఇంత టైట్ షెడ్యూల్ లోనూ వాల్మీకి ఒప్పుకోవడం విశేషమే
Please Read Disclaimer