వెండితెరపై వేల కోట్ల కుంభకోణాల హీరో కథ!

0

బాలీవుడ్ లో బయోపిక్ హీట్ అంతకంతకు అగ్గిరాజేస్తోంది. తాజాగా ఓ అనఫీషియల్ బయోపిక్ గురించి హిందీ సినీవర్గాల్లో వాడి వేడిగా చర్చ సాగుతోంది. ఎలాంటి ఆర్భాటం లేకుండా సైలెంటుగా షూటింగ్ చేసేస్తున్న ఈ బయోపిక్ ఎవరి జీవితకథతో వస్తోంది? అంటూ ఆరాలు మొదలయ్యాయి. ఇంతకుముందు టైటిల్ రివీలైనా.. ఎందుకనో సీక్రసీని మెయింటెయిన్ చేయడం వేడెక్కిస్తోంది.

అయితే ఇది ఫలానా స్టాక్ బ్రోకర్ స్కాం స్టర్ సినిమా అంటూ ప్రచారం వేడెక్కిస్తోంది. ఓ స్టాక్ మార్కెట్ బ్రోకర్ కథతో.. అంటూ కొందరైతే పేరు కూడా రివీల్ చేశారు. స్టాక్ మార్కెట్ పేరు చెబితే ప్రప్రథమంగా వినిపించే పేరు హర్షద్ మెహతా. స్టాక్ మార్కెట్ వ్యవస్థని తునాతునకలు చేసి పతాక శీర్షికల కెక్కించిన ఘనగ ఆయనది. స్టాక్స్ లో భారీ కుంభకోణానికి తెరతీసి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాడు. స్టాక్ మార్కెట్ ని మ్యానిపులేట్ చేసి వేల కోట్ల కుంభకోణానికి తెరలేపిన హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్ వ్యవస్థలో పెనుకంపనానికి కారణమయ్యారు.

తాజాగా ఆయన జీవితకథనే అనఫిషియల్ బయోపిక్ గా తెరపైకి తీసుకొస్తున్నారట. `ది బిగ్ బుల్` పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్ హర్షద్ మెహతాగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అతనికి జోడీగా ఇలియానా నటిస్తోంది. 1990- 2000 మధ్య కాలంలో హర్షద్ మెహతా సృష్టించిన కుంభకోణాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సెప్టెంబర్ 17న ఈ చిత్రం సైలెంట్ గా మొదలైంది. అజయ్ దేవగన్.. ఆనంద్ పండిట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కుకీ గులాటీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాత దేవగన్ ప్లాన్ చేస్తున్నాడు. అభిషేక్ – అజయ్ దేవగన్ ప్రయత్నం చూస్తుంటే సైలెంటుగా సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కూడా తెరకెక్కే ఛాన్సుందా? అంటూ టాలీవుడ్ లో మరోసారి చర్చ మొదలైంది. ఇంతకుముందు ఆర్జీవీ అలాంటి ప్రయత్నం చేస్తున్నానని ప్రకటించి వదిలేశారు. ఆ తర్వాత దాని గురించిన చర్చనే లేదుPlease Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home