ఆ రేపిస్ట్ ప్రొడ్యూసర్ కి కరోనా సోకింది

0

హార్వే వీన్ స్టెయిన్.. ఈ పేరు తెలియని సినీ అభిమానులు ఉండరు. ప్రతిష్టాత్మక ‘ఆస్కార్’ అవార్డు సాధించి ‘మీటూ’ ‘కాస్టింగ్ కౌచ్’ ఉద్యమాలకి ఆజ్యం పోసి మన ఇండియాలో కూడా సుపరిచితమైన వ్యక్తి హార్వే వీన్ స్టెయిన్. 2017లో డజను మంది హీరోయిన్లకు పైగా హార్వేపై చేసిన లైంగిక ఆరోపణల ద్వారా తెరపైకి వచ్చిన ఈ నిర్మాత.. తన కెరీర్ లో 80మందికి పైగా మహిళలపై లైంగిక దాడులకు పాల్పడినట్లు తెలిసివచ్చింది. ఆ తర్వాత ఉద్భవించిన మీటూ’ ‘కాస్టింగ్ కౌచ్’ ఉద్యమాలు ప్రపంచ వ్యాప్తంగా ఎంత ప్రాచుర్యం పొందాయో తెలిసిందే. యావత్ చిత్ర పరిశ్రమ తలదించుకునేలా చేసిన సంఘటన అది. పోలీసుల థర్డ్ డిగ్రీతో అన్ని నిజాలను బయటపెట్టిన హార్వేకి కోర్టు 23 సంవత్సరాల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. పటిష్ట బలగాల మధ్య న్యూయార్క్ స్టేట్ జైలులో కాలం గడుపుతున్న ఈ రేపిస్ట్ ప్రొడ్యూసర్ మళ్ళి ఇప్పుడు వార్తల్లో నిలిచాడు.

నయాగరా గెజిట్ అనే స్థానిక వార్తాపత్రిక పప్రచురించిన వివరాల ప్రకారం ఈ రేపిస్ట్ ప్రొడ్యూసర్ కి కరోనా పాజిటివ్ లక్షణాలు బయటపడ్డాయంట. అతనితోపాటు గదిలో ఉన్న మరో ఒకరికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా అతనికి పాజిటివ్ అని తేలిందని సదరు పత్రిక చెప్పుకొచ్చింది. అతని న్యాయవాది మరియు జైలు కన్ సల్టెంట్ కూడా ఈ విషయంపై స్పందించలేదు. అయితే ఈ విషయంపై జైలు అధికారులను అడుగగా జైలు అంతర్గత విషయాలు బయటకి చెప్పే అధికారం లేనందున ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఆ వార్తా పత్రిక పేర్కొంది. ఇదిలా ఉంచితే హార్వే ఈ మధ్యే తన పుట్టిన రోజును జైలు గోడల మధ్య జరుపుకున్నాడు. అతనికి కరోనా సోకిందని తెలిసిన వాళ్ళు అతని చేసిన పాపాలు ఏదొక రూపంలో ఇలా వెంటాడుతూనే ఉంటాయని శపిస్తున్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-