మూడో గదిలోకి నాగ్ వస్తాడా ?

0

పేరున్న ఆర్టిస్టులు లేకుండా కేవలం కథను నమ్ముకుని యాంకర్ ఓంకార్ తీసిన రాజు గారి గది తనకు పెద్ద పేరే తీసుకొచ్చింది. అయితే సీక్వెల్ కోసం స్టార్లను జోడించి పెద్ద అద్భుతాలు సృష్టించవచ్చేమో అనుకుంటే జస్ట్ ఎబోవ్ యావరేజ్ ఫలితాన్ని అందుకుంది. నాగార్జున సమంతాల స్క్రీన్ ప్రెజెన్స్ పెర్ఫార్మన్స్ రెండూ ఎంతో కొంత రాజు గారి గది 2ని నిలబెట్టాయి. ఆ స్ఫూర్తితోనే మూడో భాగాన్ని తీస్తానని ఓంకార్ అప్పుడే ప్రకటించాడు.

కాని దానికి సంబంధించిన ఎలాంటి అప్ డేట్స్ ఇప్పటిదాకా ఇవ్వలేకపోయాడు. మధ్యలో మా ఛానల్ కోసం ఓ రియాలిటీ షోలో బిజీ అయిపోయిన ఓంకార్ ఇక రాజు గారు గదికి స్వస్తి పలికినట్టే అనుకున్నారందరూ. అయితే తాజా సమాచారం మేరకు అది పక్కకు తప్పుకోలేదట. దానికి మీద వర్క్ జరుగుతోందని తెలిసింది. ఇప్పటికే ఓ కొలిక్కి వచ్చిందని ఫైనల్ వెర్షన్ రెడీ చేసుకున్నాక ఓంకార్ ప్రకటించే ఆలోచనలో ఉన్నట్టు సన్నిహితుల మాట

ఇప్పుడీ రాజు గారి గది 3 కోసం ఓంకార్ నాగార్జున వైపే మొగ్గు చూపుతున్నాడట. కొద్దిరోజుల క్రితం వెంకటేష్ పేరు కూడా వినిపించింది. గతంలో ఈ జానర్ లో చేసిన నాగవల్లి చేదు ఫలితాన్ని ఇచ్చిన నేపధ్యంలో వెంకీ అంత పాజిటివ్ గా రెస్పాండ్ కాకపోవడంతో బాల్ తిరిగి నాగ్ కోర్ట్ కే వచ్చినట్టు వినికిడి. కాని నాగ్ ఇప్పటికే రెండు సీక్వెల్స్ కి కమిట్ అయ్యాడు.

మన్మధుడుతో పాటు సోగ్గాడే చిన్ని నాయనలకు కొనసాగింపులు ఇప్పటికే సిద్ధమయ్యాయి. ఇప్పుడీ రాజు గారి గది 3 కూడా ఓకే చేస్తే అన్ని అవే చేస్తున్నారు అనే అభిప్రాయం ప్రేక్షకుల్లో కలుగుతుంది. అందుకే కింగ్ ఒప్పుకుంటాడా అనే దాని గురించి క్లారిటీ అయితే లేదు. ఇంకొద్ది రోజులు ఆగితే ఓంకార్ స్వయంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అప్పటిదాకా లెట్ వెయిట్ అండ్ సీ.
Please Read Disclaimer