మహేష్ సినిమా కోసం రాజమౌళి వర్క్ చేయడం స్టార్ట్ చేశాడా…?

0

దర్శధీరుడు రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్’ తరువాత తన తదుపరి ప్రాజెక్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఉంటుందని ప్రకటించిన విషయం తెలిసిందే. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కే.ఎల్ నారాయణ నిర్మాతగా తెరకెక్కనున్న ఈ చిత్రం 2021 ఇయర్ ఎండింగ్ లేదా 2022 ఫస్ట్ హాఫ్ లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని అందరూ అనుకున్నారు. ఇక ఎన్టీఆర్ – రామ్ చరణ్ లతో తెరకెక్కిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ కంప్లీట్ అయిన వెంటనే మహేష్ సినిమా స్క్రిప్ట్ వర్క్ మరియు ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేయనున్నారని భావించారు. ఇక మహేష్ కూడా ఆ లోపు మరో ప్రాజెక్ట్ పూర్తి చేయొచ్చని పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా అనౌన్స్ చేశారు. అయితే కరోనా వచ్చి ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ కి బ్రేక్స్ వేసింది.. మహేష్ సినిమా సెట్స్ పైకి వెళ్లకుండా చేసింది. దీంతో సినీ అభిమానులు మహేష్ – రాజమౌళి సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో.. ఎప్పుడు కంప్లీట్ అవుతుందో అనే విషయాలు ఆలోచించడం మానేశారు.

కాగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల వలన ఇంటికే పరిమితమైన రాజమౌళి ఇప్పటికే మహేష్ కోసం స్టోరీ రెడీ చేసే పనిలో పడ్డారట. తన తండ్రి విజయేంద్రప్రసాద్ తో కలిసి ఈ స్టోరీ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేశారట. అయితే మహేష్ కోసం రాజమౌళి ఎలాంటి స్టోరీ సిద్ధం చేస్తున్నాడనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. కొన్నేళ్ల నుంచి వీరి కాంబినేషన్ లో సినిమా చూడాలని ఆశపడుతున్న ఫ్యాన్స్ ఏ జోనర్ లో ఈ సినిమా ఉండబోతోందో అని ఇప్పటి నుంచే ఆలోచించడం స్టార్ట్ చేశారు. ‘బాహుబలి’ చిత్రాన్ని ఫిక్షనల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించిన రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ ని ఫిక్షనల్ పీరియాడిక్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. మరి మహేష్ తో కూడా ఆయన పీరియాడిక్ డ్రామా తీస్తారా లేక కాంటెంపరరీ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందిస్తారా అనే ఆసక్తి అందరిలో పెరిగిపోయింది. అయితే ఓ సందర్భంలో మహేష్ తో జేమ్స్ బాండ్ తరహా స్టోరీతో సినిమా చేయాలని రాజమౌళి వెల్లడించారు. మొత్తం మీద మహేష్ – రాజమౌళి కాంబోలో రాబోయే సినిమా జోనర్ ఏదైనా భారీగా తెరకెక్కడం ఖాయమని చెప్పవచ్చు. ఇక ఇప్పటి వరకు మహేష్ బాబు పాన్ ఇండియా మూవీస్ చేయలేదు. మరి రాజమౌళి సినిమాతో మహేష్ పాన్ ఇండియా మూవీస్ లో యాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తాడేమో చూడాలి.