హ్యాట్సాఫ్: కార్ల తో సైరా అక్షరాలు

0

మెగాస్టార్ చిరంజీవి కంబ్యాక్ మూవీ ‘ఖైదీ నంబర్ 150’ రిలీజ్ సమయంలో ఇటు తెలుగు రాష్ట్రాలు సహా ప్రపంచ దేశాల్లో మెగాభిమానుల సందడి తెలిసిందే. దేశంలోని అన్ని ప్రముఖ దేవాలయాల్లో మెగా ఫ్యాన్స్ పూజలు పునస్కారాలతో పాటు హోమాలు కూడా చేశారు. అమెరికాలోనూ మెగాభిమానులు అద్భుతమైన విన్యాసాలు చేశారు. అప్పట్లోనూ కార్ ర్యాలీ… బైక్ ర్యాలీ అంటూ అమెరికా మెగా ఫ్యాన్స్ బోలెడంత సందడి చేశారు. చిరు రీఎంట్రీకి ఘనంగా వెల్ కం చెప్పారు.

తాజాగా మరోసారి ‘సైరా-నరసింహారెడ్డి’కి అలాంటి ప్రచారమే చేస్తున్నారు. అమెరికాలో లోవా అనే రాష్ట్రంలో మెగా ఫ్యాన్స్ ప్రత్యేకించి ఓ కార్ ర్యాలీని నిర్వహించారు. ఇది సంథింగ్ స్పెషల్ అనే చెప్పాలి. లోవా స్టేట్ లో దేశ్ మోయిన్స్ అనే పాపులర్ సిటీలో 24 కార్లతో ఈ ర్యాలీని నిర్వహించారు. ఆసక్తికరంగా ఈ కార్లతోనే ‘సై..రా’ అంటూ అక్షరాల్ని రాశారు. ఈ అక్షరాల్ని డ్రోన్  కెమెరాల సాయంతో ఏరియల్ వ్యూలో చిత్రీకరించారు. ఆ వీడియో ప్రస్తుతం అభిమానుల సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

దీనికి సామాన్య జనాల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. దేశ విదేశాల్లో అన్ని వైపుల నుంచి ఈ వీడియో చూసి అమెరికా మెగా ఫ్యాన్స్ ని ప్రశంసిస్తున్నారు. ర్యాలీలో పాల్గొనలేకపోయినా అందులో పాల్గొన్నవారిపై ఇతర ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. హ్యాట్సాఫ్ టు మెగా ఫ్యాన్స్ అన్న ప్రశంసలు దక్కాయి. మెగాస్టార్ చిరంజీవికి ట్రిబ్యూట్ గా ఈ ఫీట్ ని ప్లాన్ చేశారు మెగా ఫ్యాన్స్.
Please Read Disclaimer