నాన్నకు ప్రేమతో రష్మిక ఎమోషన్ చూశారా?

0

రష్మిక మందన … పరిచయం అవసరం లేని రైజింగ్ యంగ్ బ్యూటీ. కన్నడ నుంచి వచ్చి టాలీవుడ్ ని ఏల్తోంది. వరుసగా అగ్ర హీరోల సరసన ఆఫర్లు దక్కించుకుని సాటి నాయికల నడుమ నెవ్వర్ బిఫోర్ అనేలా హవా సాగిస్తోంది. మహేష్ .. బన్ని.. తారక్ ఇలా రష్మిక కాల్షీట్ల చార్ట్ అంతా టాప్ హీరోలతోనే నిండి ఉంది.

ఇండస్ట్రీలో క్షణం తీరిక లేకుండా నటిస్తున్న భామగా రష్మికకు ఓ రేంజు ఉంది. ఇకపోతే ఈ లాక్ డౌన్ పీరియడ్ లో రష్మిక టైమ్ పాస్ విన్యాసాలు అభిమానులకు తెలిసినదే. సోషల్ మీడియాల్లో రకరకాల ఫోటోలను వీడియోల్ని షేర్ చేసింది ఈ అమ్మడు. కుటుంబంతో సమయాన్ని స్పెండ్ చేయడంపై ఆనందం వ్యక్తం చేసింది.

లేటెస్టుగా తన తండ్రితో మనోహరమైన క్షణాల్ని ఆస్వాధిస్తున్న ఫోటోల్ని షేర్ చేసింది. వీటిని చూస్తుంటే రష్మిక నాన్న కూచీనా? అన్న సందేహం కలగక మానదు. దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రాచుర్యం పొందిన నటీమణి కాబట్టి ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. కొన్ని వరుస విజయాలు.. దాంతో పాటే వ్యక్తిగత జీవితం కారణంగా ఈ కుర్రబ్యూటీ ఎప్పటికీ యూత్ లో సంచలనమే.

ప్రస్తుతం బన్ని సరసన రష్మిక పుష్పలో నటిస్తోంది. రష్మిక మహిళా ప్రధాన పాత్రలో నటించనుందని సమాచారం. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. పుష్పతో పాటు కార్తీ సరసన ఓ సినిమా చేస్తోంది. కన్నన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సుల్తాన్ అని టైటిల్ ని నిర్ణయించారు.

రష్మిక గ్రాఫ్ చూస్తే.. కన్నడ చిత్రం కిరిక్ పార్టీతో నటనా రంగ ప్రవేశం చేసింది. తరువాత వెనుదిరిగి చూసిందే లేదు. ఆమె అంజని పుత్రా చమక్.. ఛలో.. గీతా గోవిందం తదితర చిత్రాలలో నటించింది. సోషల్ మీడియాలోనూ నిరంతరం స్పీడ్ గానే ఉంటూ అభిమానుల్ని పెంచుకుంటోంది.

అలాగే వ్యక్తిగతంగా రష్మిక తల్లిదండ్రులకు చాలా క్లోజ్. షిమాన్ అనే అక్క ఉంది. రష్మిక తన సోదరి బిడ్డతో విలువైన సమయం వెచ్చిస్తుంటుంది. తరచూ తన తల్లి నాన్నలతో ఫోటోలను పంచుకుంటుంది. అందుకే నాన్న కూచీ అంటూ రష్మికను సోషల్ మీడియాలో అభిమానులు పోస్ట్ చేస్తుంటారు.

ఫాదర్స్ డే సందర్భంగా రష్మిక డాడీతో ఫోటోను షేర్ చేసి “హ్యాపీ ఫాదర్స్ డే పా .. నేను నిన్ను ప్రేమిస్తున్నాను .. అన్నింటికీ ధన్యవాదాలు. మీరు ప్రపంచంలోని గొప్ప నాన్న“ అంటూ ఉద్వేగానికి గురైంది.