అల్లు వారసులు జోష్ చూశారా

0

మెగా ఫ్యామిలీలో దీపావళి సంబరాల గురించి తెలిసిందే. ఇక అల్లు కాంపౌండ్ లోనూ ఈ దీపావళి సంథింగ్ స్పెషల్ గానే జరిగింది. దీపావళి రోజు టపాసులు పేలక ముందే బన్ని ఫ్యామిలీ ఇదిగో ఇలా కెమెరాకు ఫోజులిచ్చారు. పండగ వాతావరణం ఆ కొత్త డ్రెస్సుల్లోనే కనిపిస్తోంది.

అల్లు అర్జున్ – స్నేహ జంటతో పాటు ఇద్దరు చిచ్చరపిడుగుల అల్లరి తెలిసిందే. అల్లు అయాన్.. అల్లు అర్హ ఇద్దరూ చకచకా ఎదిగేస్తున్నారు. క్యూట్ చబ్బీ అర్హ ఇంటిల్లిపాదీని ఓ రేంజులో ఆట పట్టించేస్తోంది. అర్హ ఎంత ఉల్లాసంగా ఉందో ఈ ఫోటో బయటపెట్టింది. బోసినవ్వులు చిందిస్తూ క్యూట్ గా అర్హ ఇదిగో ఇలా గోపికమ్మ డ్రెస్ తో తెగ ముద్దొచ్చేసింది. అలాగే మాస్టర్ అయాన్ ఏమైనా తక్కువా .. బుద్ధిమంతుడిలా కనిపిస్తూనే సైలెంటుగా బన్నిలా ఏదో ఎక్స్ ప్రెషన్ ఇచ్చాడు స్టైలిష్ గా. కిడ్స్ తో మామ్ డాడ్ అంతే జోష్ గా కనిపిస్తున్నారు.

ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో అల వైకుంఠపురములో చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్న అల్లు అర్జున్ ప్రచారం పరంగానూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాములో రాములా అంటూ ఈ దీపావళి కానుకగా రిలీజ్ చేసిన వీడియోలో బన్ని స్టెప్పులకు అభిమానుల నుంచి అద్భుత స్పందన వచ్చింది. కొత్ పోస్టర్లు అంతే ఆకట్టుకున్నాయి. భారీ తారాగణంతో ఫుల్ ఫ్టెడ్జ్ డ్ ఫ్యామిలీ పోస్టర్ ని రిలీజ్ చేస్తే అద్భుత స్పందన వచ్చింది. టబు-జయరాం-నవదీప్- సుశాంత్- సునీల్ ఈ పోస్టర్ లో కనిపించారు. 12 జనవరి 2020 న ఈ చిత్రం రిలీజవుతోంది. మరోవైపు బన్ని సుక్కూ స్క్రిప్టుపైనా దృష్టి సారించిన సంగతి తెలిసిందే. అయితే దీపావళి రోజు దీనికి సంబంధించిన అప్ డేట్ ఏదీ రాలేదు.
Please Read Disclaimer