చిన్న సినిమాలో పెద్ద విషయం

0

ఎలాంటి సినిమా తీశామన్నది కాదు అది జనాన్ని మెప్పించిందా లేదా అనే సూత్రాన్ని బాగా వంటబట్టించుకుంటున్నారు బడ్జెట్ పరిమితులున్న దర్శక నిర్మాతలు. కంటెంట్ ని ఎంత బాగా ప్రెజెంట్ చేస్తున్నాం అనే దాని మీదే ఎక్కువ ఫోకస్ పెడుతున్న వీళ్ళ సృజనాత్మకత వల్లే మంచి క్వాలిటీ అవుట్ ఫుట్ ఉన్న సినిమాలు వస్తున్నాయి. అలాంటిదే ఈ హవా. అందరూ కొత్త వాళ్ళతో మహేష్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ యాక్షన్ థ్రిల్లర్ తరహాలో ఉంది.

ట్రైలర్ మొదట్లోనే ఫ అక్షరంతో మొదలయ్యే బూతు పదాన్ని కీలకమైన ఆర్టిస్టులతో చెప్పించి కథలో ఉద్దేశమేంటో తెలియజెప్పిన దర్శకుడు మేకింగ్ ని మాత్రం టాప్ స్టాండర్డ్ లో చూపించాడు. గుర్రపు పందేలు-మాఫియా – హ్యూమన్ ట్రాఫికింగ్ – డ్రగ్స్ – లవ్ – హేట్ ఇలా అన్ని అంశాలు కలిగలిసి మొత్తానికి స్టైలిష్ ఎంటర్ టైనర్ ని రూపొందించిన ఫీలింగ్ కలిగింది. బోల్డ్ కంటెంట్ ని బాగానే ప్రెజెంట్ చేసినట్టు సీన్స్ ని బాగా గమనిస్తే అర్థం చేసుకోవచ్చు. ఈ నెల 23న విడుదల ప్రకటించేసిన హవా రజిని 2.0 కన్నా కేవలం ఆరు రోజుల ముందే వచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది.

సంతోష్ శనమోని ఛాయాగ్రహణం మంచి క్వాలీటి ఇవ్వగా గిఫ్టన్ ఇలియాస్ సంగీతం సింక్ అయ్యింది. ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ గురించి ఎక్కువ చెప్పునే అవకాశం లేకుండా ఫాస్ట్ గా కట్ చేయడంతో కామెంట్ చేసే అవకాశం ప్రస్తుతానికి ఇవ్వలేదు. చైతన్య-దివి ప్రసన్న-స్టీఫెన్ – కమల్ కృష్ణ- జోసెఫ్- జాకోబర్-మర్ఫి-సందీప్ తదితరులు కీలక పాత్రలు పోషించిన హవా 9 గంటల్లో 9 మెదళ్ళు కలిసి చేసే 9 క్రైమ్స్ చుట్టూ అల్లుకున్న కథ. ఇదే థ్రిల్ సినిమాలో కూడా ఉంటే బొమ్మ వర్క్ అవుట్ అయినట్టే.
Please Read Disclaimer