ఆన్ లొకేషన్ అల్లు ప్రిన్సెస్ గుర్రపు స్వారీ

0

లిటిల్ ప్రిన్సెస్ అల్లు అర్హ బర్త్ డే వైబ్స్ గురించి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఉన్న బన్ని అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియాల్లో అర్హకు స్పెషల్ బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు. కుమార్తె నాలుగో బర్త్ డేని స్పెషల్ డేగా ప్లాన్ చేయడంలో బన్ని ది బెస్ట్ అనిపించారు. అర్హకు నేడు డాడీ బన్ని నుంచే అన్ లిమిటెడ్ గిఫ్ట్స్ అందుతున్నాయి.

ఇంతకుముందు రెడ్ పేపర్ ర్యాప్ బాక్స్ తో చాక్లెట్లు వగైరా స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన బన్ని.. కొద్దిసేపటి క్రితం `అంజలి` కవర్ సాంగ్ ని రిలీజ్ చేసి మరో అదిరిపోయే గిఫ్టిచ్చారు. అర్హ నాలుగో బర్త్ డేకి ఇది ఎంతో స్పెషల్ అంటూ అభిమానులు పొగిడేశారు. ఈలోగానే ఇదిగో ఇలా అర్హ గుర్రంపై సవారీ చేస్తున్న ఫోటోలు రివీలయ్యాయి. ఇంతకీ ఈ ఫీట్ వేసింది ఎక్కడ? అన్నది ఆరా తీస్తే తుపాకీకి తెలిసిన ఎక్స్ క్లూజివ్ సంగతులు ఇలా ఉన్నాయి.

ప్రస్తుతం అల్లు అర్జున్ -సుకుమార్ బృందం గోదారి పరిసరాల్లోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో పుష్ప షూటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. మారేడుమిల్లి అడవిలో ఉన్న వుడ్స్ రిసార్ట్ లో అల్లు ఫ్యామిలీ స్టే చేసింది. కుటుంబ సమేతంగా బన్ని ఇక్కడే ఉంటున్నారు.

ఆ రిసార్ట్ వద్దకే గుర్రం వచ్చింది. రాగానే బేబి అర్హ దానిపైకి ఎక్కి ఇలా సవారీ చేసింది. బర్త్ డే బేబికి అన్ లిమిటెడ్ ట్రీట్ ని అంత స్పెషల్ గా ప్లాన్ చేశారు బన్ని. అర్హ ఎంతో మురిసిపోతూ గుర్రంపై స్వారీ చేస్తోందిలా. టుడే బేబి అర్హ డే.. అలా మార్చడంలో లవ్ లీ డాడీ బన్నీ ప్లానింగ్ ఎంతో ఉంది.