మహేష్ 27.. దర్శకుడు అతడే !

0

మహేష్ నెక్స్ట్ లిస్ట్ లో పరశురాం వంశీ పైడిపల్లి రాజమౌళి సందీప్ రెడ్డి వంగ ఉన్న సంగతి తెలిసిందే. వీరిలో ముందుగా పరశురాంతో సినిమా చేయనున్నాడు మహేష్. ఇప్పటికే రెండు సార్లు మహేష్ తో కథా చర్చలు జరిపాడు పరశురాం. అయితే రెండ్రోజులుగా ఈ సినిమా ఉండదని మహేష్ నెక్స్ట్ సినిమా పరశురాంతో చేయట్లేదని పుకార్లు బయలు దేరాయి. అందరూ ఇదే నిజమేమో అనుకున్నారు కూడా. కానీ అందులో నిజం లేదట. పరశురాం చెప్పిన స్టోరీ సూపర్ స్టార్ కి బాగా నచ్చిందని త్వరలోనే ఫైనల్ నెరేషన్ ఉంటుందని ప్రస్తుతం బజ్జీ అదే పనిలో ఉన్నాడని తెలుస్తుంది.

సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్ ని పండించడంలో పరశురాం దిట్ట. అయితే ఇప్పటి వరకూ యంగ్ హీరోలను మాత్రమే డైరెక్ట్ చేసిన బుజ్జీ ఇప్పుడు మహేష్ తో ఎలాంటి సినిమా చేస్తాడా..అని సూపర్ ఫ్యాన్స్ ఎదురుస్తున్నారు. ‘గీత గోవిందం’తో తనలోని సత్తా ఏంటో చాటుకున్న ఈ దర్శకుడు మహేష్ తో ఏ రేంజ్ విజయం అందుకుంటాడో చూడాలి. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి ఫైనల్ నెరేషన్ కి రెడీ అవుతున్నాడు పరశురాం. ఈ కాంబినేషన్ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్నారు.

ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు మహేష్ బాబు. అనిల్ రావి పూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ ఏడెకల్లో జరుగుతుంది. కశ్మీర్ లో తీయాల్సిన ఒక ఫైట్ తాలూకు సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. మరో రెండు రోజుల పాటు షూట్ జరగనుంది. ఇక్కడ పని ముగించాక రామోజీ ఫిలిం సిటీలో వేసిన సెట్ లో కొన్ని కీలక సన్నివేశాలు తీస్తారు. ఈ సినిమా షూట్ ఫినిష్ అవ్వగానే అంటే ఈ ఏడాది చివర్లో మహేష్- పరశురాం సినిమా సెట్స్ పైకి వస్తుంది.
Please Read Disclaimer