హెబ్బా హాట్ నెస్ ఓవర్ లోడెడ్

0

సుకుమార్ రైటింగ్స్ నిర్మించిన `కుమారి 21ఎఫ్` చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైంది హెబ్బా పటేల్. నటించిన తొలి సినిమాతోనే యువతరంలో క్రేజీ నాయికగా పేరు తెచ్చుకుంది. వరుసగా ఒకదాని వెంట ఒకటిగా అరడజను సినిమాలకు కమిటైంది. అయితే ఇవేవీ సరైన విజయాన్ని ఇవ్వలేదు. మధ్యలో `ఎక్కడికి పోతావు చిన్నవాడా?` చిత్రంతో సక్సెస్ అందుకున్నా అంతగా కలిసి రాలేదు. మిస్టర్.. నాన్న నేను బోయ్ ఫ్రెండ్.. అంధగాడు.. ఏంజెల్.. ఇవన్నీ వరుసగా ఫ్లాపులై ఇబ్బంది పెట్టాయి.

చివరి హోప్ `24 కిస్సెస్` ఫెయిలవ్వడం హెబ్బాకి మరో షాక్. ఈ చిత్రంలో ఎంత బోల్డ్ ట్రీటిచ్చినా నెగెటివ్ ఫలితాన్నే చవి చూసింది. ప్రస్తుతం నితిన్ సరసన `భీష్మ`లో అవకాశం అందుకుంది. ఈ చిత్రంలో రష్మిక మందన ప్రధాన నాయిక. హెబ్బా రెండో నాయికగా కన్ఫామ్ అయ్యింది. కొన్ని వరుస ఫెయిల్యూర్స్ తర్వాత ఈ ఆఫర్ తనకు బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. ఇటీవల నితిన్ – హెబ్బా జంటపై కీలక సన్నివేశాల చిత్రీకరణ సాగిందని తెలుస్తోంది. ఛలో ఫేం వెంకీ కుడుముల దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజాగా హెబ్బా పటేల్ సామాజిక మాధ్యమాల్లో ఓ కొత్త ఫోటోని రివీల్ చేసింది. ఈ ఫోటో హెబ్బాని కొత్త కోణంలో ఆవిష్కరిస్తోంది. ఇప్పటికే ఆన్ లైన్ లో వైరల్ కావడంతో యూత్ జోరుగా కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. అమేజింగ్.. ఛామింగ్.. ఫెంటాస్టిక్ అంటూ పొగిడేస్తున్నారు ఫ్యాన్స్. `హాట్ నెస్ ఓవర్ లోడెడ్` అంటూ కొందరు ఫ్యాన్స్ ఎగ్జయిట్ అవుతున్నారు. ఈ ఫోటోలో ఛమ్కీలు మెరుపుల టాప్ తో హెబ్బా ఎదురు చూపులు హాట్ నెస్ ని ఎలివేట్ చేస్తున్నాయి. ఇంతకీ ఈ స్టిల్ ఎక్కడిది? నితిన్ సినిమాలో హెబ్బా పాత్రను ఇది రివీల్ చేస్తోందా? ఈ సందేహానికి హెబ్బానే క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.
Please Read Disclaimer